పుట:Gurujadalu.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దొంగిలించి చుట్టలు గట్టి, తగలెట్టవలసినదే. ఒకవేళ, గిరీశం గారూ, తమరు దొంగతనం చేశారు. కొద్ది రోజులు నరకానికి విజయంచెయ్యండి, అని దేవుఁడు గానీ, అన్నట్టాయనా, ఒకచిన్న లెక్చరు కొట్టి, గభరాయింపజేస్తాను. వెంకటేశం :యేవని లెక్చరు కొడతారు? గిరీ : యేవఁనా? ఓ దేవుఁడా! నా మనస్సు యిండిపెండెంటుగా సృజించావా? లేక డిపెండెం టుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే, నా యిష్ట వొచ్చినపనల్లా నేను చేశాను, నువ్వెవరు అడగడానికి? యిలాంటి చిక్కులు పెట్టావంటే హెవెన్లో చిన్న నేషనల్ కాంగ్రెస్ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అగయితే నువ్వే నా చేత పాపం చేయించావు గనక నీకే ఆ శిక్ష కావలిసింది. దేర్ ఫోర్ చలో, నరకానికి, ఛలో! అక్కణ్ణించి నువ్వు తిరిగి వొచ్చేలోగా, ఆరు ఘడియలు స్వర్గంలో అధికారం, నాకిసిపట్టాయనా, కొన్ని సృష్టిలో లోపాలు సవరణ చేస్తానంటాను. వెంక యేవింటండి లోపాలు?

లోపాలన్న లోపాలా! నీ చేతే వొప్పిస్తాను. నెంబర్ వన్ - నీ మేష్టరు లాంటి అభాజనుణ్ణి

పుట్టించడం లోపం అంటావా అనవా? వెంక : లోపవే. గిరీ : నీ సిస్టర్ లాంటి బ్యూటిఫుల్ యంగ్ గర్లుని, విడోని చెయ్యడం తప్పంటావా, ఒప్పంటావా? వెంక : తప్పే. గిరీ : యిలాంటి లోపాలు కోటాన కోట్లు. యిక రద్దు సృష్టి యంతుందనుకున్నావు? ఫరిస్టెన్స్, యెన్ని సముద్రాలు వున్నాయి? వెంక : యేడు. గిరీ : యేడూ, యేడిసినట్టే వున్నాయి. పాల సముద్రం వుంటూ వుండగా మళ్ళీ పెరుగు సముద్రం, నేతి సముద్రం యెందుకోయి? యిది ప్లియోనిజమ్, పునరుక్తి - మరో తెలివితక్కువ చూశావా? యెందుకూ పనికిమాలిన ఉప్పు సముద్రం మన నెత్తిని కొట్టి, పెరుగు, పాలు, నెయ్యి, చెరుకుపానకం, యీ సముద్రాలన్నీ యవడికీ అందుకు రాకుండా దూరంగా విసిరేశాడోయి. ఒక సంవత్సరం గాని నాకు దేవుఁడు దీవాన్దరీ యిస్తే, భీముని పట్టానికి పాల సముద్రం, విశాఖపట్టానికి మంచినీళ్ళ సముద్రం, కళింగపట్టానికి చెరుకు సముద్రం తెస్తాను. యీ యీస్టర్ను ఘాట్సు అంతా పొగాకు కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 315