పుట:Gurujadalu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : యేమిటి నీ నిర్బంధం? సిద్ధాంతి : గుంటూరు శాస్తులుగారి పేరేవిఁటో మీ క్కావాలా? రామ : యేమిటా పేరు? సిద్ధాంతి: పేరి రామశాస్తులు గారు. ఆయన పేరుతో మీకేం పనుంది? రామ : వాడు నాకు బాకీ. సిద్ధాంతి : మీకు ఒక దమ్మిడీ బాకీ లేదు. ఆ నిజం నాకు తెలుసును. రామ : చెయ్యి నొక్కేస్తున్నావేవిఁటి? సిద్ధాంతి :వైదీకపాళ్ల చెయ్యి మృదువుగా యలా వుంటుంది? అవధాన్లు గారు యిచ్చిన సొమ్ము తాలూకు నిలవ యెంతుందో చెప్పండి. రామ : నువ్వెవరివి అడగడానికి? అన్న! చెయ్యి నొక్కుతున్నావు! తంతావా యేవిఁటి? సిద్ధాంతి శుభమల్లె, పెళ్లి కూతుర్ని ముండా ముతకా, అంటే యెవరయినా వూరుకుంటారా? రామ : ముండకాదు, పుని స్త్రీయే, అంటాను; చెయ్యి వొదిలెయ్యి, (లుబ్ధావధాన్లు శిష్యుడికి కొంతయడంగా జరుగును) సిద్ధాంతి : కోపం వొచ్చినప్పుడు లౌక్యం మరిచి పోకూడదు. మీరు ప్రభువులూ; మేం ఆశ్రితులం. తమకిలాభించే మాట చెబుతాను, యిలా దయ చెయ్యండి. రామ : మర్యాదగా మాట్లాడితే, నా అంత మంచివాడు లేడు. సిద్ధాంతి : అవధాన్లు గారూ మీరు కూడా యిలా రండీ (అవధాన్లు, సిద్ధాంతి, రామప్పంతులూ రహస్యముగా మాట్లాడుదురు) రామ : (ఉత్సాహముతో) సిద్ధాంతీ యేదీ పొడిపిసరు. నియ్యోగపాడన్నవాడు, సవబుకి కట్టుబడతాడు. యవరయా వంట బ్రాహ్మలు! మా యింటికి పలహారాలు వెళ్లాయా? యేవోఁయి, కొండిబొట్లూ! మాట, యిలారా. (కొండిబొట్లు వచ్చును) కొండి: యేం శలవు? రామ : మా యింటిదాకా నాతోరా. కొండి : చిత్తం. రామ : మా తోట్లో, మంచి పనసకాయలున్నాయి. రెండు కాయలకి బరాతవిస్తాను. తెచ్చుకో మీ అయ్యకి పనసకాయ కూరంటే, మా యిష్టం. గురుజాడలు 309 కన్యాశుల్కము - మలికూర్పు