పుట:Gurujadalu.pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రామ : యేవిఁటండి? సిద్ధా : విశాలవ్కైన నేత్రాలూ, ఆకర్ణాలు, ఆవుంగరాల జుత్తూ, విన్నారా? యేదమ్మా చెయ్యి (చెయ్యి చూసి) మీ అదృష్టవంతుడు యీ పిల్లని పెళ్లాడాడో గాని... రామ : యింకా పెళ్లి కాలేదండి. సిద్ధా: మీరు పెళ్లి చేసుకోవాలని వుంటే, యింతకన్న అయిదోతనం, అయిశ్వర్యం, సిరి, సంపదాగల పిల్ల దొరకదు. యిది సౌభాగ్య రేఖ, యిది ధనరేఖ, పంతులూ బోషాణ ప్పెట్టలు వెంటనే పురమాయించండి. యెది తల్లీ చెయి తిప్పు. సంతానం వకటి, రెండు, మూడు. (చెయ్యి వదిలి లుబ్ధావధాన్లతో) యెదీ మావాఁ పొడి పిసరు. (పొడుం పీల్చి) పోలిశెట్టి కూతురు ప్రసవం అవుతూంది. జాతకం రాయాలి. మళ్ళీ దర్శనం చాస్తాను. రామ : వక్కమాట (సిద్ధాంతితో రహస్యంగా మాట్లాడును. సిద్ధాంతి చంకలో పంచాంగం తీసి, చూచును. మరి నాలుగు మాటలాడి పంచాంగం చంకని పెట్టుకుని తొందరగా వెళ్లిపోవును.) లుబ్దా :

యేవఁంటాడు?

రామ : నేనే యీ పిల్లని పెళ్ళిచేసుకుంటానను కుంటున్నాడు. రేపటి త్రయోదసి నాడు పెళ్లికి మంచిది అన్నాడు. లుబ్ధా : ఆ రోజు వివాహ ముహూర్తం లేదే? రామ : శుభస్య శీఘ్రం అన్నాడు. ద్వితీయానికి అంత ముహూర్తం చూడవలసిన అవసరం లేదు. తిథీ నక్షత్రం బాగుంటే చాలును. యిదుగో మీ మావఁగారు వొస్తున్నారు. లుబై : బేరవాఁడి చూడండి. (కరటక శాస్తులు ప్రవేశించును. ) కరట : గంగాజలం సిరస్సున పోసుకున్నారా యేవిఁటి పంతులు గారూ? మా పిల్లని యెక్కడికి తీసికెళ్తున్నారు? రామ : (కరటక శాస్త్రితో) మాట. (ఇద్దరూ రహస్యముగా మాటలాడుదురు). (లుబ్ధావధాన్లును యెడంగా తీసుకెళ్లి) పధ్నాలుగు వొందలు తెమ్మంటున్నాడు. యెవళ్లో పదమూడు యిస్తావఁన్నారట. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 302