పుట:Gurujadalu.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లుబా : పెళ్లి ప్రయత్నం యిక మానుకోవఁడవేఁ ఉత్తమం, అని తోస్తుంది. యేవిఁటి తమ శలవు? రామ : నా శలవేం యేడిసింది. పెళ్లి చేసుకోవొద్దని మధురవాణి శలవైంది. దాని బుద్ధికి ఆనం దించి అలా నడుచుకుంటున్నారు. స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః అని చెప్పనే చెప్పాను. లుబ్ధి : మీరు ఆప్తులనే గదా మీ సలహాకి వొచ్చాను. మధురవాణి చెప్పిందనా పెళ్లి వద్దం టున్నాను. తప్పిన పెళ్లి తప్పిపోయింది. ఖర్చులుకూడొచ్చాయి గదా అని సంతో షిస్తున్నాను. రామ : రెడొచ్చాడు మొదలాడన్నాడట. సాధక బాధకాలు యెన్ని పర్యాయములు చెప్పినా అవి అన్ని పూర్వపక్షంఐ, ముక్తాయింపు మళ్లీ డబ్బు ఖర్చు మీదికి వొస్తూ వుంటుంది. పెళ్లి చేసుకుని కడుపు ఫలిస్తే మీ యిల్లు పది యిక్లౌతుంది. పెళ్లి చేసుకోక గుటుక్కు మంటే యీ కష్టపడి ఆర్జించిన డబ్బంతా యవడి పాలు కాను? లుబ్ధా : అదుగో యేమో యెక్కువ ధనం వున్నట్టు శలవిస్తారు? నాకేవుఁంది? రామ : వున్నంత వుంది. పరానికి యిన్ని నీళ్ల చుక్కలు వొదిలేవాడుండాలా? లుబ్ధా : అలా అయితే, తమ రెందుకు పెళ్లి చేసుకున్నారు కారూ? రామ : నేను పిత్రార్జితం అంతా కరరావుఁడు చుట్టేవేశాను. యిక పరానికా? నేను శాక్తేయు; యోగ సాధనం చేస్తాను. నాకు మరి కర్మతో పనిలేదు. లోకం కోసం తద్దినాలు పెడుతున్నాను. అయితే సానిదాన్ని యెందుకు వుంచుకున్నావయ్యా! అని అడగగలరు? “కామిగాక మోక్షకామి కాడు” అన్నాడు. యిక మీ సంగతో? మీరు నిద్దరపోతూండగా చూసి యెప్పుడో ఒకనాడు మీనాక్షి ఆపాతు యెక్కదీసి రంకు మొగుణ్ణి తీసుకు పారిపోతుంది. ఆపైని దరిద్ర దేవత మిమ్మల్ని పెళ్లాడుతుంది. లుబ్ధి : అయితే యేం జెయమంటారు? రామ : మీరు పునః ప్రయత్నం చేసి పెళ్ళాడండి. మీ పెం భయం చేత మీనాక్షి ఆట కట్టడుతుంది. మీనాక్షి భయం చేత, మీ పెళ్లాం కట్టుగా వుంటుంది. అవునంటారా? కాదంటారా? లుబై : నిజవైఁనమాటే. రామ : నిజవైతేనేం? మీకు బహుపరాకు. సాధక బాధకాలు అడుగడుక్కీ జ్ఞాపకం చేస్తూండాలి. మీకు జాతకరీత్యా వివాహం జరక్కపోతే, మార్కం వుందన్న మాట పరాకుపడ్డారా? గురుజాడలు 298 కన్యాశుల్కము - మలికూర్పు