పుట:Gurujadalu.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తాకకూడదు. అది చిన్నతనంచేత మొఖం మీద మొఖం పెడితే “పిల్లా, యడంగా నిలబడి మాట్లాడు” అని చప్పాలి. ఒక్కటే వొచ్చింది. దీనికి దుర్గుణం. పరాయివాళ్లతో మాట్లాడితే గాని దానికి తోచదు. పట్టవాసంలో వుండడంనించి ఆ దురలవాటు అబ్బింది. లుబ్ధి : చిన్నతనం గదా! మధురవాణి నా పిల్ల లాంటిది. ముట్టుగుంటే అదో తప్పుగా భావించకండి. రామ : నీ సొమ్మేం బోయింది! అదికాదు, చూశారా మావా... వుంచుకున్న ముండాకొడుకు యదట, మరో మొగాణ్ణి పట్టుకుని “వీడి దండలు కమ్మెచ్చులు తీసినట్టున్నాయి. వీడి ఛాతీ భారీగా వుంది" - అని చెవిలో నోరు పెట్టి గుసగుసలాడుతూంటే అగెత్తుకొస్తుందా రాదా? లుబ్దా : పొరపాటు, లెంపలు వాయించుకుంటాను. క్షమించండి. రామ : మీ లెంపలు వాయించుకుంటే కార్యం లేదు. దాని లెంపలు వాయించాలి. మీమీద దానికి కొంచం యిష్టం వున్నట్టుంది. గట్టిగా బుద్ధి చెప్పండి. లుబ్దా

నా మీద యిష్టవేఁవిఁటి మావార! యక్కడైనా కద్దా?

రామ : మీ యింటికి వెళ్లిపోయెస్తానంటూందే? మరి తీసికెళ్లు. (పై మాటలాడుచుండగా మధురవాణి పట్టుచీర కట్టుకుని ప్రవేశించి.) మధు : అలాగే తీసికెళ్తారు మీకు భారవైఁతేను. ఆ మహానుభావుడికి చాకిరీ చేస్తే పరం ఐనా వుంటుంది. లుబ్ధా : మామగారు హాస్యానికంటున్నారు గాని, నిన్నొదుల్తారా? నేతగను, తగను. రామ : అలా గడ్డి పెట్టండి! మధు : ఆయన హాస్యానికి అంటున్నా, నేను నిజానికి అంటున్నాను. గడ్డి గాడిదలు తింటాయి; మనుష్యులు తినరు. రామ : అదుగో మళ్లీ గాడిదలంటుంది! (మధురవాణి నవ్వు దాచుటకు ముఖం తిప్పికొని, లోగుమ్మము దాటి, విరగబడి నవ్వును) లుబా : మధురవాణికి మీదగ్గిర భయంభక్తి కూడా కద్దు. రామ : వుంది. కోపవొస్తే గడ్డిపరకంత ఖాతరీ చెయ్యదు. పరాయి మనిషి వున్నాడని అయినా కానదు. గురుజాడలు 297 కన్యాశుల్కము - మలికూర్పు శ్