పుట:Gurujadalu.pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : నేను కదలను. రామ : అమాంతంగా యెత్తుకెళ్లి వెనకింట్లో కుదేస్తాను. మధు : (కుర్చీ వెనకను నిలబడి లుబ్ధావధాన్లు దండలు చేతులతో గట్టిగా పట్టుకుని) మార్కండే యులు శివుణ్ణి చుట్టుకున్నట్లు, బావగార్ని చుట్టుకుంటాను. యెలా లాక్కువెళతారో చూస్తాను. లుబ్దా: : (తనలో) యేమి మృదువూ చేతులు! తల, తల దగ్గర చేరిస్తే, యేమి ఘుమ ఘుమా! (పైకి) “బాలాదపి సుభాషితం” అన్నాడు మావఁగారూ - మధురవాణి వుణ్ణియ్యండి. మంచి బుద్ధిమంతురాలు. నిజం కనిపెడుతుంది. రామ : అయితే మరివిను (చదువును) మీ కొమార్తె ప్రవర్తన బాగా వుండకపోవడం చాత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగా వున్నది." లుబై :

(కొంత తడవు వూరుకుని) నువ్వే నాకొంప తీశావు.

మధు : పంతులేనా? లుబై : ఒహర్ననవలసిన పనేవుఁంది? మధు : (కొంత తడవు వూరుకొని) నేను మీ యింటికి వెళ్లిపోయొస్తాను. రండి. పెళ్లీగిళ్లీ మానెయ్యండి. మీకు పెళ్లాంకన్న యెక్కువగా సంరక్షణ చేస్తాను. లుబా : (ఆనందం కనపరుస్తూ) బీదవాణ్ణి నేను డబ్బివ్వలేనే? నీలాంటి విలవైన వస్తువను పంతులుగారే భరించాలి. మధు : నాకు డబ్బక్కర్లేదు. తిండి పెడతారా? లుబ్ధి : ఆహా! అందుకు లోపవాఁ! మధు : ఐతే పదండి, మరి యీ పంతులుగారి మాయమాటలు వినక పెళ్లి మానేసి, సుఖంగా యింట్లో కూచుందురు గానీ. రామ : (మధురవాణి వైపు తీక్షణముగా చూసి) నువ్వు భోజనం చెయ్యలేదన్నమాట జ్ఞాపకం వుందా? వెళ్లు. మధు : మీ చర్య చూస్తేనే కడుపు నిండుతుంది. (ఛఱ్ఱుమని యింటిలోనికి పోవును. ) లుబ్దా : యీ మధురవాణి. విన్నారా! మావాఁ! వేశ్య అయినా! చాలా తెలిసిన మనిషి. మన సంసార్లకి దానికి వున్న బుద్ధివుంటే బతికిపోదుం. రామ : అవుఁను. బుద్ధిమంతురాలే; గాని వొళ్లెరగని కోపం. యేవైఁనా వెట్టి అనుమానం పుట్టితే, తనూపై కానదు. చూశారా మావాఁ, మీలాంటి శిష్ఠులు సానివాళ్ల శరీరం గురుజాడలు 296 కన్యాశుల్కము - మలికూర్పు