పుట:Gurujadalu.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- ఆ - వూరేగండి-వెన్ను కుప్పెక్కి - - ఆ వైభవం - కళ్ళారా - చూస్తాం - (మిక్కిలిగా నవ్వును, నవ్వు సమాళించుకుని) బావగారూ, క్షమించండి ఆ దుష్టు వ్రాతకి నవ్వాను - మరేంగాదు. రామ : దుష్టంటే దుష్టా! గాడిద! లుబ్ధి : మీరొహ, పెద్ద గాడిదని కూడా తెమ్మన్నారని కాబోలు, రాశాడండీ. రామ : లేదు, లేదు, గాడిదె మాట వుత్తరంలో యక్కడా లేదు. లుబ్ధా : వుంది. నేను చదివానండీ గాడిదనెందుకు తెమ్మన్నావయ్యా నానెత్తి మీదికీ? రామ : నీకు మతిపోతూందా యేమిటి? గాడిద మాట లేదంటూంటేనే? (మధురవాణి తిరిగీ నవ్వుచుండును) నీక్కూడా మతిపోయిందీ? యెందుకా నవ్వు? నన్ను చూశా? అవుధాన్లును చూశా? మధు : యెందుకు అనుమానం? సామెత వుంది. రామ : యేమిటా సామిత గీమితాను? మధు : గాడిద అందిట-పాటకి నేను అందానికి మా అప్పా - అందిట రామ : అంటే? మధు : పెళ్లికి గాడిద - లొటిపిటా మాట యిన్నాళ్ళకి - మళ్లీ విన్నానుగదా అని. రామ : వింటే? మధు : నవ్వొచ్చింది. మీరు కూడా నవ్వరాదూ? యెందుకీ దెబ్బలాట? రామ : వీడి మీద డామేజీ దావా వెంటనే పడేస్తాను. మధు : (లుబ్ధావధాన్లుతో) బావా, యెందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా అనుమానం పడతారు? ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగార్లా భావించుకుంటున్నారు. గిరీశంగారు పంతులు మీద వ్రాయడానికి కారణాంతరం వున్నది. మీతో చెప్పవలిసిన సంగతి కాదు గాని, మీ ఉభయులకూ స్నేహం చెడడానికి సిద్ధంగా వున్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్లు యింగ్లీషు చెప్పేవారు. కొద్ది రోజులు నన్ను వుంచుకున్నారు. మా పంతులుగారు ఆయన దగ్గర నుంచి నన్ను తీసుకువెళ్లి పోయి వచ్చినారనే దుఃఖం చేత లేనిపోని మాటలు కల్పించి “నక్కా గిక్కా" అని వ్రాశారు గానీ, ఆ బొల్లి మాటలు నమ్మకండి. రామ : "నక్కా గిక్కా” వొట్టినే పోతుందనుకున్నావా యేమిటి? డామేజీ దావా పడ్డతరవాత దాని సంగతి తెలుస్తుంది. 291 కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు