పుట:Gurujadalu.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యిదేవిఁటోయి, యీ బొట్లేరు యింగిలీషు! “అనగా” వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయా! “జాకాల్, అనేది, గుంటనక్క” పింజారీ వెధవ! “బిగ్యాస్, అనగా, పెద్ద వీడి సిగాదరగా! యేం వీడి పోయీకాలం! వీడిమీద తక్షణం డామేజీ దావా పడేస్తాను. (మధురవాణికి నవ్వొచ్చి, ఆపుకోజాలక, విరగబడి నవ్వును.) యెందుకలా నవ్వుతావు? నీ మొగుడు నన్ను తిడుతున్నాడనా ఆనందం? మధు : (నవ్వు చేత మాట తెమలక, కొంత సేపటికి) కాదు - కాదు - మీతోడు - లొటి రామ : నా తోడేవిఁటి! నేను చస్తే నీకు ఆనందవేఁ! మధు : (ముక్కుమీద వేలువుంచి, రామప్పంతులు దగ్గరకు వెళ్ళి, సిరస్సు కౌగలించుకొని, ముద్దెట్టుకొనును) యేమి దుష్టుమాటా! రామ : మరెందుకు నవ్వుతావ్? మధు : లొటి లొటి- రామ : యేమిటా "లాటి"? మధు : లొటి - పిట రామ : అవును, లొటిపిట, అయితే? మధు : (సమాళించుకుని) యెందుకో? రామ : యెందుకో నాకేం తెలుసును? లుబ్ధా : ఉత్తరంవల్ల మీరే తెమ్మన్నట్టు అగుపడుతూందే? రామ : నేనా? నేనా? నాకెందుకూ లొటిపిట? మధు : (ఉప్పెనగా తిరిగి నవ్వుతూ) యెక్కడానికీ. రామ : నేనా యెక్కడం? మధు : యెందుకు కూడదూ? మీరొక లొటి - పిట - బావగారొక లొటిపిట-పో పోలిశెట్టి -పెళ్ళి సప్లయిదారుడు గనక, అతడో లొటిపిట యెక్కి పొలాలంట గురుజాడలు 290 కన్యాశుల్కము - మలికూర్పు