పుట:Gurujadalu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్యాశుల్కము చతుర్థాంకము వ స్థలము : రామప్పంతులు యింటి సావిడి ( రామప్పంతులు కుర్చీ మీద కూర్చునివుండగా మధురవాణి నిలబడి తమలపాకులు చుట్టి యిచ్చుచుండును.) రామ : నేనే చిన్నతనంలో యింగిలీషు చదివివుంటే జడ్జీలయదట ఫెళపెళలాడించుదును. నాకు వాక్ స్థానమందు బృహస్పతి వున్నాడు. అందుచాతనే యింగిలీషు రాక పోయినా నా ప్రభ యిలా వెలుగుతూంది. మధు : మాటలు నేర్చిన శునకాన్ని వేటకి పంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట. రామ : నేనా శునకాన్ని? మధు : హాస్యానికన్న మాటల్లా నిజవఁనుకుంటారేవిఁ? రామ : హాస్యానికా అన్నావు? మధు : మరి మీతో హాస్యవాఁడకపోతే, వూరందరి తోటీ హాస్యవాఁడమన్నారా యేవిఁటి? రామ : అందరితో హాస్యవాడితే యరగవా? మధు : అంచేతనే కుక్కన్నా, పందన్నా, మిమ్ముల్నే అనాలి గాని, మరొకర్ని అనకూడదే? మిమ్మల్ని యేవఁనడానికైనా నాకు హక్కు వుంది. యిక మీ మాటకారితనం నాతో చెప్పేదేమిఁటి? మీ మాటలకు భ్రమసే కదా మీ మాయలలో పడ్డాను? రామ : నాకు యింగిలీషే వొస్తే, దొరసాన్లు నా వెనకాతల పరిగెత్తరా? మధు : మీ అందానికి మేము తెనుగువాళ్ళము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవొచ్చింది. గిరీశం గారు మాట్లాడితే దొరలు మాట్లాడినట్టు వుంటుందిట. రామ : అటా, యిటా! నీకేం తెలుసును. వాడు వొట్టి బొట్లేరు ముక్కలు పేల్తాడు. ఆ మాటలుగానీ కోర్టులో పేలే చెప్పుచ్చుకు కొడతారు. మధు : అదేమో మీకే తెలియాలి! గాని, గిరీశం గారు లుబ్ధావధాన్లు గారి తమ్ములటా? చెప్పారు కారు! రామ : నీ మనసు వాడి మీదికి వెళుతూందేం? ఐతే నీకెందుకు, కాకపోతే నీకెందుకు? మధు : మతిలేని మాటా, సుతి లేని పాటా, అని. రామ : నాకా మతీ లేదంటావు? గురుజాడలు 283 కన్యాశుల్కము - మలికూర్పు