పుట:Gurujadalu.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

“శాంతంభోషాణపెట్ట” అనుకుని నోరు మూసుకు వూరుకున్నాను. యిహ నాచ్చి కొశ్చన్ మాట వినండి. సానివాళ్ళని హతవాఁర్చడం మంచిదంటారా కారా? బుచ్చమ్మ : వాళ్లని చంపేస్తారా యేవిఁటి? గిరీశం: చంపక్కర్లేదు, "పొమ్మనక్కర్లేదు, పొగబెడితే” చాలునన్నట్టు సానివాళ్లని పెళ్లిళ్లకు పిలవకపోవడం, వాళ్లిళ్లకి వెళ్లకపోవడం, వాళ్లని వుంచుకోకపోవడం పైం చెప్పిన పనులు చేసేవాళ్లని కనపడ్డ చోటల్లా తిట్టడం, యిలా నాలాంటి బుద్ధిమంతులంతా ఒహటై కొంతకాలం చేసేసరికి, కలికంలోకైనా మరి సాంది వుండదు. లేకుంటే చూడండి. మన వెంకటేశం పెళ్లికి తప్పకుండా సానిమాళం తెస్తారు. నే యెరుగుదును. కూడదన్న పనల్లా మావఁగారు చాస్తారు, కూడిన పని మానేస్తారు. సానిమాళం తావడ మనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడమన్నమాట కాదా? పెళ్లి నాటికి నా ప్రియ శిష్యుడికి కొంచెం యీడొస్తుంది గదా. ఆ సానిముండలు యజ్ఞగా బుజ్జిగా వుండడం చూసి, పెళ్లాం మీద అసహ్యం పుట్టి “యీ పసిపిల్ల యదగడవెఁప్పుడు, కాపరానికి రావడవెఁప్పుడు, యీ సానివాళ్లు మామజాగా వున్నారని వాళ్లని వెంకటేశం వుంచు కుంటే కొంప ములిగిపోతుంది గాని తరవాయి వుండిపోతుందా? యేవఁంటారు? బుచ్చమ్మ : అవును నిజవేఁ గిరీశం : గనుక లోకం బాగుపడేటందుకుగాను వెధవలికి పెళ్లి చెయ్యడానికి, సానివాళ్లని సాగనంపడానికి వీరకంకణం కట్టాను. మరే వచ్చి, మీ తమ్ముళ్లాంటి వాళ్లకి అనేకులికి విద్యాబుద్ధులు చెప్పుతున్నాను. గజీతగాణ్ణి ఔటచేత నూతుల్లో గోతుల్లో పడ్డ వాళ్లని పైకి తీస్తాను. యింకా నాషనల్ కాంగ్రెస్ ఒహటుంది గానీ అందులో నే చేసేపని చాంతాడంత వ్యాఖ్యానం చేస్తే గాని మీకు బోధ పడదు. పరిపరి విధాల లోకోపకారం చేస్తున్నాను. బుచ్చమ్మ : యీ పనులన్నీ పెళ్లి చేసుకుంటే మాత్రం చెయ్యకూడదా? గిరీశం: యలా జెయడం? లోకవఁంటే యేవిఁటి గంజిగుంట అనుకున్నారా? యేషియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రలేషియా అని, ఐదు ఖండాలు. అందులో అమెరికాలో మనుష్యులు బుఱ్ఱకిందికీ కాళ్లు పైకీ పెట్టి నడుస్తారు. యిక్కడ పగలు గదా యిప్పుడు? అక్కడ రాత్రి. నార్త్ పోల్ అని మరో దేశం వుంది. అక్కడ ఆర్నెల్లు పొగలే; అప్పుడు మరి రాత్రుండదు. ఆర్నెల్లు రాత్రే; అప్పుడు మరి పొగలుండదు. అక్కడేవిఁ టనుకున్నారు? సముద్రం అంతా మంచు కెరడైపోతే లేళ్లని బళ్లకి కట్టి సవారీణ, వాయువేగ మనోవేగంగా వెళతారు. యిన్ని దేశాలకీ వెళ్లి అక్కడి వాళ్లకల్లా ఉపకారం కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 276