పుట:Gurujadalu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4వ స్థలము. పెరటిలో జామిచెట్టు కొమ్మ మీద వెంకటేశం కూచుని జామిపండు కొరుకుచుండును. (చెట్టుకొమ్మలు ఆవరించివున్న నూతిలో నీరు బుచ్చమ్మ తోడుతుండును.) బుచ్చమ్మ : తమ్ముడూ, గిరీశం గారు గొప్పవారప్రా? వెంక : గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్ బానర్జీ అంత గొప్పవారు. బుచ్చమ్మ : అతగాడెవరు? వెంక : అందరికంటే మరీ గొప్పవాడు. బుచ్చమ్మ : అయితే గిరీశం గారికి వుద్యోగం కాలేదేమి? వెంక : నాన్సన్స్! నువ్వు ఆడదానివి; నీకేం తెలియదు. ఉద్యోగవఁంటే గొప్పనుకుంటున్నావు. ఉద్యోగవంటే యేమిటో తెలిసిందా? సర్వెంట్ అన్నమాట. బుచ్చమ్మ : అనగా యేమిటి? వెంక : సర్వెంటనగానా? నౌఖర్ అన్నమాట. మన గేదెని కాసే అశిరిగాడు ఒక సర్వెంట్. యిల్లు తుడిచే అంకి ఒక సర్వెంట్. వీళ్లు మన నౌఖర్లు. పోలీసూ, మునసబూ, తెల్లవాడి నౌఖర్లు. జీతం లావురాగానే గొప్పనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్ బానర్జీ, గిరీశం గారూ లాంటి గొప్పవాళ్లు తెల్లవాడి దగ్గిరకాదు, దేవుఁడి దగ్గరైనా నౌఖరీ చెయ్యమంటే చెయ్యరు. కలక్టరేవంటాడో తెలిసిందా? పోలీసువెళితే “స్టాండ్!” నిలుచో అంటాడు. గిరీశం గారు వొచ్చారంటే షేక్ హాండ్ చేసి కుర్చీ మీద కూచోండి అంటాడు. ఆయనకి హైదరాబాదు నవాబు వెయ్యిరూపాయల పని యిస్తామంటే, నీపనెవడిక్కావాలి పొమ్మన్నాడు. బుచ్చమ్మ : ఆయనకి పెళ్లేందిరా? వెంక : లేదు. బుచ్చమ్మ : తమ్ముడూ, వెధవలు పెళ్లాడ్డం మంచిదంటారుగదా, ఆయనెందుకు పెళ్లాడారు కార్రా? వెంక : నీకు యంతచెప్పినా తెలియదు (గట్టిగా) ఆయన ఉద్యోగం చెయ్యకపోవడం, పెళ్లి మానుకోవడం లోకం మరామత్తు చెయ్యడానికట; యిప్పుడు తెలిసిందా? బుచ్చమ్మ : యలా మరమ్మత్తు చేస్తున్నారా? మన గురుజాడలు 272 కన్యాశుల్కము - మలికూర్పు