పుట:Gurujadalu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమి వస్తువులున్నవి. సే కోర్ట్ స్. వెంకటేశ : వెధవలు. గిరీశం: నాన్ సెన్స్, సే కోర్ట్స్, అగ్ని : యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు. ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనా యేమిషి వున్నది? గిరీశం : వెధ్వల్ అన్నది లాటిన్ మాటండి ఆ మాట కర్థం కచేరీలండి. కచేరీలు యెందుకున్నవి? వెంకటేశ : దావాలు తేవడముకు. గిరీశం : దట్ ఈజ్ రైట్ - చూచారండీ మీ వాడికి కచేరీల భోగట్టాలు కూడా నేర్పుతున్నాను. అగ్ని : అయితే మన దావా విషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగా చూశారా? గిరీశం : కేసు గెలవడముకు యేమీ అభ్యంతరము లేదు. మీకు తెలియడం కోసం గ్రంథం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారూ మీ విషయమై యెంత శ్రమయినా పడి అమలాపురం వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు. అగ్ని : యేదో అంతా మిమ్మలినే నమ్ముకుని వున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే చాలును. పెళ్లి పనులకి మీ కుమ్మక్కు వుంటేనే కాని తూగదు సుమండీ.నామీద కోపంచాత కరకటశాస్త్రుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లు వొచ్చేటట్టు కనపడదు. గిరీశం : మీరు కూర్చున్న దగ్గరినుంచి కాలుకదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను చేస్తాను కాదూ. (నిష్క్రమించుచున్నారు. ) గురుజాడలు 271 కన్యాశుల్కము - మలికూర్పు