పుట:Gurujadalu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

గిరీశం: నాన్సెన్స్, అది మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ అంటే, విధింపబడిన పని యేమనగా, విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషనులో యేమున్నది? వెంక : నాకు తెలియదు. గిరీశం: రామవరములో వెధవ వివాహము చేసుకున్న వాళ్లకల్లా నెల వక్కంటికి నూరు రూపాయలు యిచ్చి పోషించడమునకు విడోమారేజి సభ వకటి యున్నది. ఇదివరకు అయిదు వేల మంది విధవలకు వివాహములు అయి పునిస్త్రీలు అయిపోయినారు. ఆల్ రైట్! క్రియేషన్ అనే మాట అయినది. ఆసెంటెన్సు అంతకూ అర్ధము చెప్పు. వెంక : మీరొకమాటు చెప్పిన తరవాత నేచెబుతాను. గిరీశం: ఆల్‌ రైట్! ప్రపంచములో దేవుడు ప్రతి వస్తువునూ యేదో వొక వుపయోగము కొరకు చేసి యున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ? వెంక : తినడముకు. గిరీశం: దట్ ఈజ్ రైట్, ఆవులనెందుకు చేశాడు? వెంక : పాలు యివ్వడముకు? గిరీశం: పెర్ ఫెక్ట్ లీ రైట్, ఆడవాళ్లనెందుకు చేశాడు? వెంక : వంట చెయ్యడానికి. గిరీశం: నాన్ సెన్స్. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ. గనక పెండ్లాడకుండా వున్న వెధవ పిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు. (అగ్నిహోత్రావధానులు ప్రవేశించును) అగ్ని : ఏమండీ గిరీశంగారూ మా కుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ? గిరీశం: ఘంటసేపాయి చెపుతున్నానండి. అగ్ని : యేదీ నేను కూడా వింఛాను కొద్దిగా చెప్పండీ. గిరీశం: మైడియర్ బోయ్, గాడ్ మేడ్ క్రియేషన్, సృష్టి యెవడు చేసినాడూ, వెంకటేశ : దేవుడు. గిరీశం: ఫాదర్ ఈజ్ నెస్ట్ టు గాడ్. దేవుని తరువాత ముఖ్యం యెవరూ! సే ఫాదర్ వెంకటేశ : తండ్రి. అగ్ని : మొత్తము మీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచూన్నది. భాషభేదం గాని మన ముక్కలే వాళ్లవిన్నీ. గురుజాడలు 270 కన్యాశుల్కము - మలికూర్పు