పుట:Gurujadalu.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేసుకుంటినట్టాయనా కీర్తీ, సుఖం కూడా దక్కుతాయి. “టూ బడ్స్ యట్ వన్ షాట్!” యిలాంటి అట్టర్లీ యిన్నోసెంట్ విడోని చొప్పించి తీసుకుపోయి పెళ్లాడితే మజా, ప్రయోజకత్వమూ గానీ, రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడితోనో, దూదేకులవాడితోనో లేచిపోవడానికి సిద్ధంగా వున్న దండు ముండల్ని విడో మారియేజి చేసుకుంటే హెల్! పూట కూళ్ళమ్మలాంటి ముండని పెళ్ళాడ్డం విడో మారియేజి అనిపించుకోదు. అది దొంగ ముండా మారియేజి! యిదేవిఁటయా యిదీ, యీ బుచ్చమ్మ? సాక్షాత్తూ పరమపవిత్రమైన విదో విత్ గిల్ట్ లెటర్స్! అయితే, గియితే మ- రా-రా-శ్రీ, యన్ - గిరీశం గారు విడో మారియేజి చేసుకోవడమేనా? “టు మారీ యె విడో, ఆర్ నాట్ టు మారీ, దటీజ్ ది క్వశ్చన్!” షేక్ స్పియర్ పడ్డ అవస్థలో పడ్డాం! “తొందరపడి హాజీసాహేబు తురకల్లో కలిసిపోయినాడన్నట్లు" నావంటి బుద్ధిమంతుడు తొందరపడి యేపనీ చెయ్యకూడదు. దాని లాభనష్టాలు బేరీజు వేసి, జమా ఖర్చు చేసుకుని మరీ డిసైడ్ చెయ్యాలి. లెటస్ సీ, Imprimis ఒకటో పద్దు డెబిట్ (నష్టం)- విడో మారియేజి చేసుకుంటే మావాళ్లు అక్కర చెయ్యరు. అందుకు క్రెడిట్, (లాభం) - వాళ్లిప్పుడు చేస్తూన్న అక్కరేవుఁంది గనక బాలెన్స్ (గాక బాకీ) నిల్, బండిసున్నా! రెండో పద్దు! డెబిట్ (ఖర్చు) - లోకం నన్ను బహిష్కారంచేస్తారు. అందుకు క్రెడిట్, (జమ)-లోకంలోకల్లా విలవైన వస్తువను నేను అంకించుకుని, పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను. గనక క్రెడిటు బాలెన్సు (నిలవ) -యేమిటయా? నెగెటివ్ యడ్వాంటేజి, హావింగ్ నథింగ్ టుడూ వితే పాపర్ వరల్డు పోజిటివ్ యడ్వాంటేజి -పొజెసింగ్ ఆలిట్స్ వెల్త్! మూడోపద్దు - డెబిట్ - నష్టం - “వీడి పెళ్లాం వెధవముండ” అంటారు. నోటాబీనీ - యీ పద్దు నిజంగా డెబిటేనా? ఆడిట్ డిపార్టుమెంటువార్నడిగి సంశయం తీర్చుకోవాలి. అందాకా మ-రా-రా-శ్రీ, గిరీశం గారి అభిప్రాయం యేమంటే - విడో అనేది యేమిఁటి? ఏ నేమ్! ఓ పేరు! ఆ పేరు మనిషి మొహమ్మీద రాశుందా? మనిషిని ముస్తాబు చేసి యదట నిలబెడితే, యిది పునిస్త్రీ, యిది విడో అని చప్పగలిగిన పెద్దమనిషి యవడు? ఒహడూ లేడు, గనక విడో అనే వస్తువ యక్కడుందయా? వెక్కిరించే వెధవల నోళ్లలో వుంది. దీనికి క్రెడిట్, (లాభం) యేమనగా-విడో పెళ్ళాడిందంటే అశుభం వోగాయిత్యం అని అటెవడూ కన్నెయ్యడు. యిక డెబిట్లేని శుద్ధ క్రెడిట్, నంబర్ ఫోర్, "చుక్కలవలె, కర్పూరపు ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్ కిక్కిరిసి పిక్కటిల్లెను", అన్నట్లు గిరీశంగారి కీర్తి మిన్ను ముట్టుతుంది. గిరీశం గారి విధవా వివాహ మహోత్సవం కథ న్యూసు పాపర్లలో పెద్దక్షరాలో పడుతుంది. క్రెడిట్ నెంబర్ ఫైవ్ విడోమారియేజి యసోసియేషన్ వారు కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 266