పుట:Gurujadalu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మధు : దుష్టు మాటలనగా తగిలే తప్పా? జవాను: యేవఁయ్యోయి. పోయి, రూపాయి లిచ్చావు కావని యినస్పెక్టరు గారితో చెబుదునా? మధు : (మెడలో నానుతీసి) యిదీ తాకట్టు వుంచి కావలసిన సొమ్ము తెచ్చుకొండి. రామ : (తనలో) ఆహా ! యేమి యోగ్యమైన మనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు! కరట : పంతులుగారూ యెన్ని రూపాయలు కావాలండి? రామ

పాతిక. కరట : నే దాఖల్చేస్తాను (జవానుకు యిచ్చును) రామ : ధన జాతకానికి డబ్బలా వొస్తూ వుంటుంది. యేవిఁటి మీ రాచకార్యం? కరట : యిది నా పిల్లండి. దీనికి వివాహం చేయించి ఆ సుకృతం తమరు కట్టుకోవాలి. రామ : వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను. నాకు మంత్రాలు రావే? (చుట్ట, జేబులోంచి తీసి కొనకొరికి) యేవఁంటావు మధురవాణీ? అగ్గిపుల్ల, మధు : (అగ్గిపుల్ల అందిస్తూ పంతులు నుంచి శిష్యుడి వేపూ, శిష్యుడి నుంచి పంతులు వేపూ కోపముతో చూసును.) కరట : మంత్రవఁన్నప్పుడు వైదీకపవాడిదేం మంత్రవఁండి? యీ రోజుల్లో వైదీక మ్మంత్రాల మహిమ పోయిందండి. మంత్రవఁంటే నియ్యోగ ప్రభువుదే మంత్రం! తమవంటి ప్రయోజకులకు మంత్రం మాటాడుతుందండి. రామ : మధురం! యేవఁంటావు? యీ పిల్ల న్నే పెళ్ళి చేసుకుందునా? మధు : (రామప్పంతులు వేపూ, శిష్యుడి వేపూ చురచ చూసి నిష్క్రమించును.) రామ : సొగసుకత్తెలకి అలక కూడా అదో సృంగారం సుమండీ, శాస్తులు గారూ కరట : వైదీకపాళ్లం మాకా శృంగారాలు యలా అనుభవమౌఁతాయండి? మాయిల్లాళ్ళక్కోపం వొస్తే చీపురు గట్టలు యెగురుతాయండి. సరసఁవన్నది పుస్తకాల్లో చదవడవేఁ గానీ మాకు అనుభవవేద్యం కాదండి. శ్రీకృష్ణమూర్తివారు రాధికతో శలవిస్తున్నారు, ఓ రాధికా నీ కోపం తీర్చుకోవాలన్నషాయనా "ఘటయ భుజ బంధనం రచయరద ఖండనం, యేనవాభవతి సుఖజాలం" అనగా యేవఁంచున్నాడంటే కవీశ్వరుడు, చేతుల్తోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా కాగలించుకో, మరిన్నీ పెదీవఁలు రక్తాలొచ్చేట్టు కొరికెయ్యి, అంఛున్నాడు. రామ : (మధురవాణి వెళ్లిన గుమ్మము వేపు చూసి) ఉప్పులేకనే ముప్పందుం, మధురవాణికి మాత్రం యీ వెట్టి మొట్టి కవిత్వాలు చెప్పకండి. నాలాంటి మృదువర్లు మోట సరసం సహించరు. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 260