పుట:Gurujadalu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9వ స్థలము. రామప్పంతులు యింట్లో పడక గది (మధురవాణీ తివాసీ మీద కూచుని వీణ వాయించుచుండును. వాయిద్యం ముగించి.) మధు : విద్యవంటి వస్తువ లేదు, నిజమే - ఒక్కటి తప్ప - అదేవిఁటి? విత్తం. డబ్బు తాని విద్య దారిద్ర్య హేతువ. యీ వూళ్ళో నారదుడు వొచ్చి పాడితే నాలుగు దమ్మిడీలివ్వరు. గనక యీ వీణ యిటు పెడదాం. హెడ్డు కనిష్టబు సౌజ్ఞ చేసి వెళ్ళాడు. అతడు యిచ్చేది చచ్చేదీ లేదు గాని, జట్టీలేవైఁనా వొస్తే ఓ వొడ్డుకాస్తాడు. (వీధి తలుపు తట్టబడును.) వొచ్చాడు కాబోలు. (తలుపు దగ్గిరకి వచ్చి) యవరు మీరు? బంధువులా? (తలుపవతల కరటకశాస్తులు, కన్య వాషంతో శిష్యుడున్నూ.) కరట : ఆపదకడ్డం పడ్డ వారే బంధువులు. మేమ్మీకు బంధువులం కావుఁ గాని, మీరు మాకు బంధువులు కాగల్డు. మధు : నాస్తులా? కరట : (తనలో) యీ కంఠం విన్నట్టుంది (పైకి) నాస్తం కట్టడానికే వొచ్చాం. మధు : దేంతో కడతారు? కరట : (తనలో) యీ వేశ్య మధురవాణి కాదు గద? కంఠాన్ని పోలిన కంఠం ఉండకూడదా? (పైకి) నాస్తం కట్టడానికల్లా వున్నది ఒక్కటే గదా టంకం? మధు : యేవిఁటో ఆ టంకం? కరట : బంగారం! మధు : మా పంతులుగారికి మీరు నాస్తులూ, బంధువులు కూడా కాకపోతే తలుపు తీయ్యొచ్చును. (తలుపు తీయ్యును. ) కరట : (తనలో) అరే! మధురవాణే! మధు : (ముక్కు మీద వేలుంచుకొని) చిత్రం! కరట : యేమిటి చిత్రం? మధు : యీ వేషం! కరట : ఉదరనిమిత్తం బహుకృతవేషం; యిది దేవుఁడిచ్చిన వేషవేఁను. మధు : నాదగ్గిరేనా మర్మం? యీ పిల్లెవరో? గురుజాడలు 255 కన్యాశుల్కము - మలికూర్పు