పుట:Gurujadalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

      వేలనెరుగని ప్రేమ బంధము
      వేడుకలు కురియు.
      మతములన్నియు మాసిపోవును,
      జ్ఞానమొక్కటి నిలచి వెలుగును;
      అంత స్వర్గసుఖంబులన్నవి
      యవని విలసిల్లున్.

అంటూ మానవజాతికి ఉండవలసిన ఆకాంక్షలకు ఉదాత్తరూపం దిద్దినా,

మధురవాణి, గిరీశం వంటి పాత్రలతో నాటకం నడిపించినా,

గురజాడను నడిపింది స్వంత వివేచనే.

అదే వారి నిలువు.

3

గురజాడ వారి నిలువుని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే అది రూపొందిన స్థల, కాలాలపై దృష్టి పెట్టాలి.

అప్పటికి

1) భారతదేశంలో ఒక ఆలోచనా వర్గం ఏర్పడింది. దానికి ఆరంభకునిగా చాలా మంది భావించే వ్యక్తి రాజారామమోహన్ రాయ్. ఆయన తన సమూహంలోని కొన్ని సంప్రదాయాల పట్ల, మతం పేరిట ఆచరించుతున్న దురాచారాల పట్ల తన స్వంత వివేచనతో, ధైర్యంతో ధ్వజం ఎత్తాడు. తన పోరాటానికి ఆంగ్లేయుల శాసనాధి కారాన్ని వినియోగించుకున్నాడు. తన సమాజంలోని ఒకనాటి తాత్వికతను పునరు జ్జీవింప చేసి, మధ్యలో వచ్చిన అవాంఛిత ఆచారాలను వదిలింపజేయటానికి బ్రహ్మ సమాజం నెలకొలిపాడు. ఆంగ్లవిద్య సంస్కరణలకి అవసరమని భావించాడు. ఈ ఆలోచనా వర్గం సంఖ్యాపరంగా చిన్నదైనా దాని శక్తి పెద్దది.

2) మారటానికి ఇష్టం లేని, ధైర్యంలేని అసంఖ్యాక సమూహం ఉంది. సహజంగానే ఈ మార్పుల ప్రయత్నానికి అది సమ్మతించదు. సంఖ్యాబలం ఉన్నా, దాని శక్తి ప్రదర్శనకి ప్రధాన అవరోధం భారతదేశపు ప్రత్యేక పరిస్థితి. ఈ పరిస్థితి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల ఫలితం. అచింత్యుడూ, నిర్గుణుడూ, నిరాకారుడూ అంటూ