పుట:Gurujadalu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్పూర్ హైకోర్టు తీర్పొహటి మనకి మహాబలంగా వుంది. మా పెత్తండ్రిగారు యిలాంటి కేసే ఒహటి యీ మధ్య గెలిచారండి. అగ్ని : దీని కల్లా అసాధ్యం యీ కేసు కాకినాల్లో తేవలసొచ్చింది. మా కరటక శాస్త్రుల్లుని పంపిస్తే యవడో చవల వకీల్ని కుదిర్చాడు. వాడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడవేఁ కాని కేసు భోగట్టా యేవీఁరాయడు. గడియ గడియ వెళదావఁంటె దూరాభారం గదా? గిరీశం: మీశలవైతే స్టీమరు మీద నేను వెళ్లి ఆ వ్యవహారవంతా చక్క బెట్టుకు వస్తాను. మాపెత్తండ్రి గారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడరు, ఆయన పట్టిన కేసు యన్నడూ పోయిందన్న మాట లేదండి. అగ్ని : మీరు వెళితే నేను వెళ్లినట్టే. యంత ఫీజయినా మీ పెత్తండ్రి గారికే వకార్తీ యిద్దాం, యావంటారు? గిరీశం: మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే, ఫీజఖ్కర్లేకుండానే పని చేయిస్తానండి. అగ్ని : మీరలా అంటారన్నే నెరుగుదును. గాని గెలిచింతరవాత మనకి తోచిన బహుమతీ యిద్దాం. గిరీశం: యిచ్చినా సరె, యివ్వకపోయినా సరేనండి. (బుచ్చమ్మ ప్రవేశించును) బుచ్చమ్మ : నాన్నా అమ్మ స్తానానికి లెమ్మంచూందీ. అగ్ని : అలాగే. (బుచ్చమ్మ వెళ్లిపోతుండగా గిరీశం కేగంట చూసును) భోజనం చేశిన తరవాత కాయితాలు మీ చేతికిస్తాను; అవన్నీ సావకాశంగా చూడండి. మా యింటి తూరుప్పొరుగు రావాఁవుధాన్లు మీద మందడి గోడ విషయమై మనం తెచ్చిన దావా, లంచం పుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జి కోర్టులో అప్పీలు చేశాం; మా వకీలు అవతల పార్టీ దగ్గిర కతికి మన కేసు ధంసం చేశాడు. మీ వంటి వారు నాకు చెయ్యాసరా వుంటే రావాఁవుధాన్లు పిలకూడదీసేదును; కానిండి గాని తూర్పు మందడిగోడ రావాఁవుధా) దయితే, పడవంటి మందడి గోడ మందవాల్నా లేదా? న్యాయం చెప్పండి. చూడండీ దానిమీద యలా కొంజాయెత్తాడో! క్రిమినల్నడి పించమని భుక్త సలహా చెప్పాడు. (బుచ్చమ్మ ప్రవేశించును) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 248