పుట:Gurujadalu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: రాత్రి నీ తండ్రి, నీకు హైకోర్టు వకాల్తే దాకా చదువు చెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాల మాట కదిపాను గాని, పెళ్లినుంచి వచ్చిం తరవాత యిస్తానన్నాడు. యీలోగా చుట్ట ముక్కల్లాకపోతే గుడ్డెక్కొస్తాయి. సిగర్సు కోసం కాపర్సేవఁయినా సంపాదించావా లేదా? వెంక : లేదు, యీ ఉదయవఁల్లా అమ్మ ధుమ ధుమ లాడుతూనే వుంది. మా నాన్న పొడుం కోసం కొట్లో నిలవచేశిన పొగాకులోది వో కట్ట వోణీలో దాచి తీసుకొచ్చాను. గిరీశం: దటీజ్పోలిటిక్స్! మరియింతసేపూ చెప్పావు కావేం? చుట్టల్చుట్టుకుని యీ కోవిల గోపురంలో కూచుని కాల్చుకుందాం రా? వెంక : కోవిల్లో చుట్ట కాల్చవొచ్చునా? గిరీశం: కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీని పొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల? యేదీ కట్ట యిలాతే (కట్ట అందుకొని వాసన చూసి) ఆహా! యేవిఁ పొగాకోయి! నిజంగా కంట్రీ లైఫులో చాలా చమత్కారం వుంది. బెస్ట్ టొబాకో, బెస్టు గేదె పెరుగు, మాంచి ఘీ, అంచేత నేనోయ్ పోయట్సు “కంట్రీ లైఫ్ కంట్రీ లైఫ్” అని దేవులాడుతారు. వెంక : మీరూ పోయట్సే గదా? గిరీశం: అందుకభ్యంతరవేఁవిఁటి? నాకూ కంట్రీ లైపు యిష్టవేఁ గాని సీవఁలో లాగ బ్యూటిఫుల్ షెపర్డెన్లూ, లవ్ మేకింగూ వుండదోయ్. గ్రాస్ గర్ల్సు తగు మాత్రంగా వుంటారు గాని, మాడర్టీ స్మెల్! అదొహటిన్నీ మన దేశంలో మెయిడన్సు వుండరోయి. యంత సేపూ లవ్మేకింగ్ విడోజ్కి చెయ్యాలి గాని మరిసాధనాంతరం లేదు. వెంక : మీరు విడో మీద చేశిన పోయిట్రీ రాసి యిస్తానని యిచ్చారు కారు గదా? గిరీశం: అడగ్గానే యిస్తే వస్తువ విలవ తగ్గి పోతుంది. అదొహటిన్నీ, మట్టెండేళ్లు పోతేనే గాని దాని రసం నీకు బాగా బోధపడదు. అయినా స్పెషల్ కేసుగా నీకు ఉపదేశం చాస్తాను. నోటు బుక్కు తీసి రాయి. (గిరీశం చుట్ట కాలుస్తూ, మధ్య మధ్య చుట్ట చేత పట్టి, ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం వ్రాసును.) THE WIDOW She leaves her bed at A.M. four, And sweeps the dust from off the floor, , And heaps it all behind the door, The Widow! Of wondrous size she makes the cake, , గురుజాడలు 246 కన్యాశుల్కము - మలికూర్పు