పుట:Gurujadalu.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరోడిదగ్గిర మరో వెయ్యి, రొట్టె మీద నెయ్యి, నేతి మీద రొట్టె లాగ యేకోత్ర వృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధివంతుణ్నిచూసి పెళ్లాడితే చెప్పావ్ మజా? ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యం వుంటే పరసౌఖ్యం కూడా సాధించావేఁ అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజిమెంటు హక్కు యష్టాబ్లిష్ అవుతుంది. వెంక : కన్యాశుల్కం కూడా మంచిదంటున్నా రేవిఁటి? గిరీశం: మరేవిఁటనుకున్నావ్? నెవ్వరూ బైపోవున్నాడు, చేస్తే శుద్ధక్షవరవేఁ గాని తిరపతి మంగలాడి క్షవరం చెయ్యకూడదు. యీ అస్త్రంతోటే మీ తండ్రి వశ్యం అయినాడు. యింగ్లీషువాడు “థేంక్” అన్నాడోయి. ఆలోచిస్తే గానీ నిజం బోధపడదు. బాగా ఆలో చించగా, కన్యాశుల్కంలేని మారేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా? వెంక : యెలాగండి? గిరీశం: అలా అడగవోయి, యేం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్కవఁయిందేం? యిన్ని తులాలు బంగారం పెట్టాలి, యింత వెండి పెట్టాలి అని రూపాయిలకి బదులుగా వెండి బంగారాలకింద ధనం లాగితే, కన్యాశుల్కం అయింది కాదేం? యీ పెద్ద పెద్ద పంతుళ్ల వారంతా యిలా చేస్తున్న వారేనా? వెంక : అవును. గిరీశం: యిక దొర్లలోనో? వాళ్ల... తస్సా గొయ్యా, యిల్లు గుల్ల చేస్తారోయి; అవి గుడ్డలు కావు, అవి శెంట్లు కావు, అవి జూయల్సు కావు, మారియేజి సెటిలుమెంటని బోలెడు ఆస్తి కూడా లాగుతారు. యీ ఆర్గ్యుమెంటు నేను చెప్పేసరికి నీ తండ్రి బ్రహ్మానంద భరితుడైనాడు. లుబ్ధావుఁధాన్లు పెళ్లికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు చెప్తాను విను. వెంక : యెవిఁటండి. గిరీశం :

లుబావుఁధాన్లు ముసలాడూ, బంగారప్పిచికానున్ను. రెండేళ్లకో, మూడేళ్లకో

అమాంతంగా బాల్చీ తన్నేస్తాడు. అనగా “కిక్స్ ది బకెట్”. దాంతో నీ చెల్లెలు రిచ్చి విడో అవుతుంది. నువ్వు పెద్దవాడివైఁన తరవాత దానికి విడో మారియేజి చేశి శాశ్వతవైఁ న కీర్తి అతి సులభంగా సంపాదించవచ్చును. యెవఁంటావ్? వెంక : అవును. గిరీశం: మరో గొప్పమాట! యీ సంబంధం అయితే నీకూ నాకూ సంబంధం కలుస్తుందోయి. వెంక : అదీ నా కిష్టవే. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 245