పుట:Gurujadalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలసి ఉండటంతో - అంటే వ్యక్తి ఏం చెయ్యాలీ, ప్రభుత్వం దానితో ఎలా వ్యవహరించాలన్నది-ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బహిరంగంగా పౌరుల స్వేచ్ఛా వాదనా, ఆంతరంగికంగా వారి రాజ్య విధేయతా ప్రతిపాదిస్తాడు కాంట్. ఈ అవగాహన పై పడమటి ప్రపంచం రెండు శతాబ్దాలుగా తర్జనభర్జనలు పడుతూనే ఉంది. జర్మన్ ఆదర్శవాదం కాంట్ అవగాహన పరిమితులు చర్చించి దానిని దాటి గురజాడ కాలానికే చాలా ముందుకు వెళ్లింది. వ్యక్తి వివేచన యొక్క ఆవశ్యకత అందరూ అంగీకరించినా దానికి బౌద్ధిక సంకల్పం ఎంత అవసరమో అంతకన్న భౌతిక అవసరాలు తీరటం అవసరమన్న అవగాహన ఆ చర్చల సారాంశం. అయితే ఆ వాద ప్రతివాదాలు పడమటి ప్రపంచం దానిలో భాగమైన ఆంగ్లేయుల పాలననూ, పౌరులతో వ్యవహరించవలసిన తీరునీ ప్రభావితం చేస్తాయి. వారితో బాటు భారతదేశానికి చేరిన ఈ భావన వ్యక్తి వివేచనకి పురికొల్పింది. రాజ్యం కన్న ఎక్కువగా సమీప స్వసమూహాల (కులం, వర్ణం) అదుపులో ఉన్న భారతీయ మేధావికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించటంలో ఇది తోడ్పడింది.

గురజాడ వారి నిలువు దాదాపు దీని నుంచే ప్రభావితమైనది.

      కన్నుగానని వస్తుతత్వము
      కాంచనేర్పరు లింగిరీజులు
      కల్లనోల్లరు; వారి విద్యల
      కరచి సత్యము నరసితిన్

అని తన హేతుబుద్ధి వికసనానికి మూలం చెప్పుకున్నా,

హేలీ తోకచుక్క అన్న ఆ కాలపు సంఘటన మీద అది నష్టం కలిగిస్తుందన్న మూఢ విశ్వాసానికి వ్యతిరేకంగా “తలతు నేనది సంఘసంస్కరణ పతాకగన్” అని ప్రకటించినా,

      చూడు మునుమును మేటివారల
      మాటలనియెడి మంత్రమహిమను
      జాతి బంధములన్న గొలుసులు
      జారి, సంపదలుబ్బెడున్.
      యెల్లలోకము వొక్కయిల్లె,
      వర్ణభేదములెల్ల కల్లె,