పుట:Gurujadalu.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: ఒక పొలిటికల్ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను. వెంక : యెవింటండా అస్త్రం? గిరీశం: ఒకడు చెప్పిందల్లా మహా బాగుందండవేఁ. సమ్మోహనాస్త్రవఁంటే అదే కదా? వెంక : లెక్చరిచ్చి మా తండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే వొప్పుకున్నారూ? వెంక : కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నీలు స్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మారియేజి కూడుననే తోస్తూంది. వెంక : యిన్నాళ్లూ కూడదని చెప్పేవారే నా తోటి? గిరీశం: ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చేస్తూంటేనే గాని పొలిటిషను కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు విన్నావా? యిన్ఫెంటు మారేజీలు అయితేనే గాని, యంగ్ విడోజ్ వుండరు. యంగ్ విడోజ్ వుంటేనే గానీ, విడో మారియేజ్ రిఫారమ్ కి అవకాశం వుండదు గదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మారియేజ్ అయినప్పుడు, యిన్సెంట్ మారేజీల్లేకపోతే, సివిలిజేషన్ హట్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంటు మారేజి చేయ్యవలసిందే. యిది వాహ కొత్త డిస్కవరీ; నంబర్ టూ, చిన్న పిల్లల్ని ముసలాళ్లకిచ్చి పెళ్లి చెయ్యడం కూడా మంచిదే అని నేను వాదిస్తాను. వెంక : సుబ్బిని లుబ్ధావుధానికి యివ్వటం మంచిదంటారా యేవిఁటి? అమ్మ ఆ సమ్మంధం చేస్తే నూతులో పడతానంటూందే? గిరీశం : ఫెమినైన్స్ ఫూల్సన్నాడు. “పడుపడు అన్న నా సవితే గాని పడ్డనాసవితి లేదంది” టెవరోను. నూతులో పడడం గీతులో పడడం నాన్సన్స్. ఓ రెండుతులాల సరుకోటి మీ నాన్న చేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆ మాట మానేస్తుంది. గాని నా ఆర్గ్యుమెంటు విను. వెంక : యేవిఁటండి. గిరీశం: పెళ్ళనే వస్తువ శుభవాఁ అశుభవాఁ? మంచిదా చెడ్డదా? చెప్పు. వెంక : మంచిదే. గిరీశం: వెరిగుడ్! పెళ్లనేది మంచి పదార్థవైంతే "అధికస్య అధికం ఫలం” అన్నాడు గనక చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లి చేసి, వాడు చస్తే మరోడికి, మరోడు చస్తే మరోడికి, యిలాగ పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి అయి, వీడి దగ్గిరో వెయ్యి, వాడి దగ్గిరో వెయ్యి, గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 244