పుట:Gurujadalu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యిది కూడా చదివినట్టే వుందోయి, ఆ పువ్వెదో కవికిష్టం లేదట. యిష్టం లేక పోతె ములిగిపోయింది కాబోలు? మా గురువు గారికి దొండకాయ కూరయిష్టం లేదు, గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆ కూరె వొండుతుంది. బతికున్న వాళ్ల యిష్టవేఁ యిలా యేడుస్తూంటే, చచ్చినవాడి యిష్టాయిష్టాల్లో యేం పని? యీ చదువిక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. వెంకడికి యింగిలీషాచ్చునని యేం గబ్దాగా వుంది? కరట : యెవిఁట్రా అబ్బీ అంటున్నావు? శిష్యు : యెదో నా స్వంత ఘోష. కరట : గురువుని గదా, అదేదో నాకూ కొంచం చెబుదూ. శిష్యు : చప్పడానికేం వుఁందండి! నాటకంలో నా చాత వేషం కట్టించి పెద్ద చాంతాళ్లలాంటి హిందూస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుంది గాని నాకు నాల్రోజులికోశ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదు గదా? పట్నం వొదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వొచ్చినప్పుడు మరేం వూసుపోక “పుస్తకం తియ్యంటే” సంస్కృతం యేంవఁచ్చేని? కరట : యిటు పైన్చూడు యలా చెబుతానూ, రోజుకి నాలుగే శ్లోకాలు చెబుతాను. కొత్త శ్లోకం చదువు. శిష్యు : అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా || హిమాలయో నామ నగాధిరాజ:|| కరట : మొదటికొచ్చావేం ? శిష్యు : మొదలూ కొసా వొక్కలాగే కనపడుతూంది కరట : (నవ్వి) పోనియ్, మొదణ్ణించే చదువుదాం. శిష్యు : చదివినా యేం లాభవుఁంది. యీ శ్లోకం శుద్ధ అబద్ధంట. కరట : యవరు చెప్పారు? శిష్యు : గిరీశం గారు. కరట : యెం చెప్పాడు? శిష్యు : హిమాలయం రెండు సముద్రాలకీ దాసి, రూళ్ల గజ్జలాగ లేదట. మాపులో చూపించాడు. కరట : హిమాలయం శిగగోశిరి గాని, ఆ పుస్తకం ముణిచి నా మాట విను. గురుజాడలు 240 కన్యాశుల్కము - మలికూర్పు