పుట:Gurujadalu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పల్లిటూరు వూసు పోదనుకున్నాను గాని పెద్ద కాంపేనుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం. వెంక : మా నాన్న నాక్కూడా పెళ్ళి చాస్తాడు. గిరీశం: యీవాళో పెద్దపెళ్ళి నీకు తలవెంట్రుకంత వాసి తప్పిపోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే. యిహ నిజ వైఁన పెళ్లా? యింత చదువూ చదువుకుని నీ తండ్రి కుదిర్చిన యేవీఁ యరగని చిన్న పిల్లకా పుస్తె కడతావ్? మాంచి యెఱ్ఱగా బుజ్జిగా వున్న యంగ్విడోని నువ్ పెళ్లాడకపోతే ఐషుడ్బి యషేమాఫ్యూ! వివ స్థలము. దేవాలయం (పువ్వులతోటలో మండపం మీద కూచుని, శిష్యుడు ప్రవేశించును) శిష్యుడు: ఆర్నెల్లకోమాటు పొస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు, పాతశ్లోకాలు ఒక్కలాగున పడతాయి. యిప్పుడు కొత్తశ్లోకం కనుక్కొమ్మంటే నా శక్యవాఁ? సిద్ధాంతి నెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కోవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పి యే శ్లోకం కనపడితే ఆ శ్లోకం చదువుతాను. “మృగాః ప్రియాళుద్రు మమంజరీణాం” యిదేదో చదివిన జ్ఞాపకం లీలగా వుంది. లేళ్లు పరిగెత్తాయని కాదూ? యేం గొప్ప మాట చెప్పాడోయి కవి! లేళ్లు పరిగెత్తితే యవడిక్కావాలి, పరిగెత్తకపోతే యవడిక్కావాలి? కుక్కలు పరిగెత్తుత ్నయ్ కావా, నక్కలు పరిగెత్తుతున్నాయ్ కావా? పిల్లు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశీ కట్టడం కాళిదాసుకేం తెలుసును? తెల్లవాడిదా మహిమ! యెపట్నం యెక్కడుందో, యెకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గార్ని; నిలుచున్న పాట్ను చెబుతాడు. “ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ” ముద్దెట్టు కున్నాడబోయి ముండా కొడుకు. ముక్కట్టు కున్నాడు కాడూ? (కరటకశాస్త్రి శిష్యుడికి కనపడకుండా వెనుక నుంచి ప్రవేశించును.) “వర్ణ ప్రకరే సతి కర్ణికారం || ధునోతి నిర్గంధ తయాస్మచేతః || కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 239