పుట:Gurujadalu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీశం: యిప్పటి మట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి. యంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్, ఆల్జీబ్రా, మాథమాటిక్స్ యివన్ని హడలేసి చెప్తారండి. కరటక: (తనలో) తర్ఫీదు మాచక్కగా వుంది. వీణ్ణి పెందరాళే తోవ పెట్టకపోతే మోసం వొస్తుంది. అగ్ని : అన్నోటి చెప్తారండీ? గిరీశం : మరేవఁనుకున్నారు? మీకుఱ్ఱవాళ్లాగ చదువుకునే వాడికి ఒక నిమిషవైఁనా తెరిపుండదు. అగ్ని : అదుగో చదువంటే అప్లాగే చదువుకోవాలి. గొట్టి కాయలాడకుండా మావాణ్ణి ఖాయిదా చేస్తే యంత చదువైనా వొస్తుంది. గిరీశం: నా దగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికి రావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకు పోవాలి, అలా చదివిస్తానండి. అగ్ని : అలాగే చేస్తే మా వాడికి చదువొచ్చి అన్ని పరిక్షలూ పాసవుతాడండి. మా వాడికి డబ్బు ఖర్చు లేకుండా పెళ్లయె సాధనం కూడా తటస్థించిందండి. వెంకమ్మ : మీ నైజం కొద్దీ ఛీబ్రూ కొల్టూ మంఛారు గాని మీకు మాత్రం అబ్బి మీద ప్రేవం లేదా యేవిఁషి? పట్టంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు యంతో బెంగబెట్టుకుని అబ్బిని శలవర్జీ రాసి వెళ్లిపోయి రమ్మన్నారు కారా? చదువూ చెప్పించక పెళ్లీ చెయ్యక తీరుతుందా యేమిషి? కరట : డబ్బు ఖర్చు లేకుండా కొడుక్కి పెళ్లి చేస్తావుటోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా యేవిఁటి? పదిహేను వొందలైనా పోస్తేనే గాని అబ్బికి పిల్లనివ్వరు. అగ్ని : డబ్బు ఖర్చు లేకుండా వెంకడికి యలా పెళ్ళి చేస్తానో నువ్వే చూతువు గాని. రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లు గార్ని యెరుగుదువా? కరట : యరగను. అగ్ని : ఆయ్న లక్షాధికారి. పద్దెనిమిది వందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయ ఖర్చులూ పెడతారష, పెళ్ళి మావైభవంగా చేస్తారష, మనం పిల్లని తీసికెళ్లి వాళ్లింటే పెళ్లి చెయ్యడం, మనకి తట్టుబడి అట్టే వుండదు. ఆ పద్దెనిమిది పెట్టి పెళ్లి చేస్తాను. వెంకమ్మ : పెళ్లి కొడుక్కెన్నేళ్లు? అగ్ని : యెన్నేళైతేనేవిఁ? నలభైయ్యయిదు. వొందలూ వెంకడికి గురుజాడలు 236 కన్యాశుల్కము - మలికూర్పు