పుట:Gurujadalu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరీ : ఇంకా యింగ్లీషు కాయితాలు యేవుఁన్నా నా మీద పారయ్యండి. తర్జుమా చేసి పెడతాను. అగ్ని : అప్లాగే. వెంకమ్మ : మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ. గిరీశం: ఆలాగేనమ్మా. My dear Venkatesam- Twinkle! Twinkle! little star, How I wonder what you are ! వెంకటేశం: There is a white man in the tent. గిరీశం: The boy stood on the burning deck Whence all but he had fled. వెంకటేశం : Upon the same base and on the same side of it the sides of a trepezium are equal to one another. గిరీశం: of mar's first disobedience and the fruit of that mango tree, sing, Venkatesa, my very good boy. వెంకటేశం : Nouns ending in for fe change their for fe into ves. అగ్ని : యీ ఆడుతూన్న మాటలికి అర్థంయేవిఁషండి? గిరీశం: యీ శలవుల్లో మీ ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావఁండి. అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా? వెంకటేశం : పొగచుట్టకు సతిమోవికి కరటక: చబాష్ ! గిరీశం: డామిట్! డోంట్రేడ్ దట్, (మెల్లగా) “నలదమయంతులిద్దరు” చదువ్. వెంకటేశం : నలదమయంతులిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘవాసర నిశల్ కరట : అట్టే అట్టే, మనః ప్రభవానలవఁండే యేవిఁట్రా? వెంకటేశం : (యింటి కప్పు వేపు చూసి వూరుకుండును. ) గిరీశం : పసి పిల్లలకి అలాంటి కఠినవైఁన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి? అగ్ని : పద్యాలికి అర్థం చెప్పరూ? గురుజాడలు 235 కన్యాశుల్కము - మలికూర్పు