పుట:Gurujadalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవంలోని 'పొరుగువాడు' అన్న భావన తమ జాతివారికి మాత్రమే పరిమితం చేసుకున్నారు. జాతి పేరుతో ఏకం అయినా, లాభాలు వ్యక్తులకే దక్కినా, సంపదను జాతి పేరుతో లెక్కగట్టటం (Nation's Wealth) పడమటి ప్రపంచం అలవరచుకొని, మిగిలిన ప్రపంచానికి కూడా అలవాటు చేస్తోంది. ఇలా జాతి సంపద పెరగటం అన్న భావనకు, దానికి అవసరమైన పద్ధతులను రూపొందించుకుంటున్న పడమటి ప్రపంచం లోనే, ఆ కాలంలోనే ఒక తాత్వికమైన ప్రశ్న ఉదయించింది.

జ్ఞానోదయమంటే ఏమిటి అన్నది ఆ ప్రశ్న.

దీనికి ఇమాన్యుల్ కాంట్ చేసిన నిర్వచనం చాలా ప్రధానమైనదిగా భావిస్తారు.

Enlightenment is man's emergence from his self-imposed nonage. Nonage is the inability to use one's own understanding without another's guidance. This nonage is self-imposed if its cause lies not in lack of understanding but in indecision and lack of courage to use one's own mind without another's guidance. Dare to know! (Sapere dude.) "Have the courage to use your own understanding", is therefore the motto of the enlightenment (తనకుతాను విధించుకున్న వయో అపరిపక్వత (సంరక్షకత్వం) నుంచి మనిషి బయటపడటమే జ్ఞానోదయం. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన అవగాహనను ఉపయోగించుకోలేని అసమర్థతే వయో అపరిపక్వత. ఈ వయో అపరిపక్వత స్వయంగా విధించుకున్నదే. ఎందుకంటే దీనికి కారణం అవగాహనారాహిత్యంలో లేదు. ఇతరుల మార్గదర్శకత్వం లేకుండా తన మస్తిష్కాన్ని ఉపయోగించుకోటానికి ధైర్యం లేక పోవటంలోనూ, నిర్ణయాలు తీసుకోకపోవటంలోనూ ఉంది. తెలుసుకోటానికి ధైర్యం చెయ్! “నీ అవగాహనను ఉపయోగించుకునే ధైర్యం అలవర్చుకో”, అన్నది జ్ఞానోదయానికి నినాదం)

ఈ ప్రశ్న వెలువడటమూ, వ్యక్తులు సంపద పోగుచేసుకునే కార్యక్రమం ముమ్మరం కావటమూ, దానికి రక్షణ కోసం జాతి సంపద అన్న భావం పెంపొందించటమూ ఇంచు మించు ఒకే కాలంలో, ఒకే సమాజంలో జరగటం యాదృచ్ఛికం కాదు. అలాగని మానవజాతి అభివృద్ధిలో వీటి పాత్ర తక్కువది కాదు. వ్యక్తులు స్వతంత్రంగా ఆలోచించటం వల్ల ప్రభుత్వ పునాదులు ప్రభావితమవుతాయని, అది అంతిమంగా రాజ్యానికే ప్రయోజన కారి అవుతుందని వివరిస్తాడు కాంట్. ఈ వివరణలో తాత్వికత, రాజకీయం రెండూ