పుట:Gurujadalu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూట : అప్పనిట్రా వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా యేవిఁటి? నీ సానిముండ యలా అడ్డుకుంటుందో చూస్తాను. (పూటకూళ్లమ్మ ఒకవేపు నుంచి మంచం కిందికి దూరును. మరివొక వేపునుంచి గిరీశం పైకి వచ్చి రామప్పంతులు నెత్తి చరిచి లఘు వేసి పెరటి వేపు పరిగెత్తిపోవును.) రాము : సచ్చాస్ర నాయనా (రెండు చేతుల తలపట్టుకొని) మధురవాణీ యేవీఁబేహద్బీ ! కనిష్ఠబుక్కబురంపించూ. మధు : యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవుఁన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బతీసి పగతీర్చుకుందురు గాని. (మధురవాణి రామప్పంతుల్ని కాగిలించుకొని తల ముద్దెట్టుకుని చేతరాసి) యేవిఁ దుష్టు! మొగవాడయినవాడు యెదట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బకొడతాడూ? వాడి పొంకం అణుతురు గాని లెండి. రామ : గవురనుమెంటు జీతవిఁచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం? యీ వెధవని పజ్యండు కోర్టంటా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని కాను చూడు నా తమాషా! మధు : (రామప్పంతుల్ని ముద్దుబెట్టుకుని) మాటాడక వూరుకొండి. (మంచం కింది వేపు చూపించి నోరు మూసి) దొంగ దెబ్బ కొట్టినవాడిదే అవమానం; మీది కాదు. రామ : నొప్పెవడిదనుకున్నావు? ఆ ముండ మంచం కింద నించి రాదేం? చీపురు కట్టలాక్కో పూట : ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టే వుంది. (పైకి వచ్చును) (అంతా నిష్క్రమింతురు. ) గురుజాడలు 230 కన్యాశుల్కము - మలికూర్పు