పుట:Gurujadalu.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

9వ స్థలము : మధురవాణి యింట్లో గది (రామప్పంతులు కుర్చీ మీద కూర్చుండును, మధురవాణి యదట నిలుచుండును. ) రామ : (జేబులో నుంచి చుట్ట తీసి పంటకొన కొరికి) పిల్లా, అగ్గిపుల్ల, మధురవాణి : (అగ్గిపుల్ల వెలిగించి చుట్టకందించుచుండగా రామప్పంతులు మధురవాణి బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి యడంగా నిలబడి కోపం కనపర్చుతూ) మొగవాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి. తాకవద్దంటే చెవిని పెట్టరు గదా? రామ : నీన్ను వుంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా వూరు లేవతీసుకు వెళ్లడానికి సిద్ధవఁయ్యుంటే యింకా యవడో కోన్కిస్కా హేగాడి ఆడాలో వున్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి? మధుర : వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా? మా పంతులు గార్ని పిలిచి “అయ్యా యిటు పైని మీ తోవ మీది, నా తోవ నాది” అని తెగ తెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైదీకయితేనేమి, కిరస్తానం మనిషైతే నేమి, పూటకూళ్లమ్మను వుంచుకుంటేనేమి నన్ను యిన్నాళ్లూ ఆ మహరాజు పోషించాడు కాడా? మీరంతకన్న రసికులయినా, నా మనస్సు మీరు యంత జూరగొన్నా, ఆయన యడల విశ్వాసం నాకు మట్టుకు వుండొద్దా? రామ : పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు! వాడి బతుక్కి వాడు పూటకూళ్లమ్మని వుంచుకోవడం కూడానా! పూటకూళ్లమ్మే వాణ్ణి వుంచుకొని యింత గంజి బోస్తూంది. మధు : అన్యాయం మాటలు ఆడకండి, ఆయన యంత చదువుకున్నాడు, ఆయనకి యంత ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది. రామ : అహహ (నవ్వుతూ) యేం వెళ్లి నమ్మకం! నీవు సానివాళ్ళలో తప్ప పుట్టావు. గిరీశంగారు గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేవిఁటి, మా వూళ్ళో వున్న లుబ్ధావధాన్లు పింతల్లి కొడుక్కాడూ వీడూ! గిజ్జడని మేం పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే! వాడికల్లా వక్కటే వుద్యోగం దేవుఁడు రాశాడు. యేవిఁటో తెలిసిందా? పూటకూళ్లమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ చాకిరీ చెయ్యడం. మధు : యీ మాటలు ఆయన్ని అడుగుదునా? రామ : తప్పకుండా. కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 224