పుట:Gurujadalu.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బంట్రోతు : యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ళ లాగూరుకుండేవోణ్ణి కానండి. గిరీ అయ్యకోనేటికి తోవయిదే. బంట్రోతు :యక్కడి శెవిఁటిమాలోకం వొచ్చిందయ్యా. గిరీ : కోవఁటి దుకాణవాఁ? కస్పా బజార్లో గాని యిటి వేపు లేదు. బంట్రోతు : (గట్టిగా చెవిదగ్గర నోరు పెట్టి) పోటీగరాపులు కరీదిస్తారా యివ్వరా? గిరీ : బస, రాధారీ బంగాళాలో చెయ్యొచ్చును. బంట్రోతు : (మరీ గట్టిగా) యాడాది కిందట మీరూ సాగే కలిసియేసుకున్న పోటీగరాపుల కరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు. గిరీ : ఓహో నీవటోయ్, యవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, నింపాదిగా మాట్లాడు. రేపు ఉదయం యెనిమిది ఘంటలకి పూటకూళ్ళమ్మ యింటికి వొస్తే అణా ఫయిసలో సొమ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ? బంట్రోతు : మాటల్తో కార్యం లేదు. మొల్లో శెయ్యెట్టి నిల్సున్నపాట్ని పుచ్చుకొమ్మన్నారండి. గిరీ పెద్ద మనిషివి గదా; నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్ద మనిషి, యీ చుట్ట చూడు ఎంత మజాగా కాలుందో. హవానా అంటారు దొర్లు దీన్ని. రేప్పొద్దున్న రా రెండు కట్టలిస్తాను. బంట్రోతు : శిత్తం, సొమ్ము మాటేం శలవండి. గిరీశం: చెప్పాను కానా? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడి కొడుకు ఛండాలుడు. బంట్రోతు : మాలాడి కొడుకు శండాలుడు కాకుంటే మరేటండి. గిరీశం: నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీ పట్టుకు ప్రమాణం చేస్తాను. బంట్రోతు : శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యకపోతే నా ఆబోరుండదండి.

ఆహాఁ. నీ ఆబోరు ఒహటీ, నా ఆబోరు ఒహటీనా? (బంట్రోతు నిష్క్రమించును)

ఇన్నాళ్లకి జంఝప్పోస వినియోగంలోకి వొచ్చింది. థియాసొఫిస్టుసు చెప్పినట్లు మన ఓల్డు కస్టమ్సు అన్నిటికీ యేదో ఒహ ప్రయోజనం ఆలోచించే మనవాళ్ళు యార్పరిచారు. ఆత్మానుభవం అయితేనే గాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వొదుల్చుకునే సరికి తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్రబుద్ధేశి పలాయనం. పెందరాళే యీ వూర్నించి వుడాయిస్తేనే కాని ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి వెళదాం. మేక్ హే వైఖీ సన్ షైన్స్ అన్నాడు. కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 223