పుట:Gurujadalu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్యాశుల్కము

ప్రథమాంకము ౧వ స్థలము : విజయనగరములో బొంకుల దిబ్బ

(గిరీశము ప్రవేశించును.) గిరీశ : సాయంకాలమైంది, పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెలరోజుల కిందట యిరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను, యీవాళ ఉదయం పూటకూళ్ళమ్మకీ నాకూ యుద్ధవైఁపోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపం వొచ్చింది గాని, పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటే గాని లోకంలో నెగ్గలేం. ఈలా డబ్బు లాగేస్తే యిదీవరకు యెన్ని పర్యాయములు వూరుకుంది కాదు. యిప్పుడేదో కొంచం డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ యెవడైనా చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే యిటుపైని తిండి పెట్టేటట్టు కానరాదు. యీ వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు.

Can Love be controll'd by advice ? Will cupid our mothers obey?

శీఘ్రంగా యిక్కణ్ణించి బిచాణా యెత్తివెయ్యడమే బుద్ధికి లక్షణం; గాని మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా వున్నది.

It is women that seduce all mankind.

నేను యేమో ఉద్యోగాలూ ఊళ్ళూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో వుంది, పూర్ క్రీచర్!గురుజాడలు కన్యాశుల్కము - మలికూర్పు 219