పుట:Gurujadalu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పట్టినకేసు పోవడమన్నమాట యెప్పుడూలేదు. యో డిఫెన్సు చిత్తగించండి. (అనీ చంకలోని రుమాల్ కట్టతీసి విప్పి యందులోని యొక కాగితము తీసి చదువును) ‘ఫిర్యాదీచెప్పిన సంగతులు యావత్తూ అబద్ధంకాని యెంత మాత్రం నిజంకావు.” చూశారూ ఆ వక్కమాటతోటే ఫిర్యాదీ వాదం అంతా పడిపోతుంది. 'ఫిర్యాదీ నామీద గిట్టక దురుద్దేశంతో కూహకంచేసి కేసు తెచ్చినాడు కానీ యిందులో యెంతమాత్రం నిజంలేదు.

రామప్ప: డిఫెన్సు మాటకేమండి కాని అవధాన్లుగారు పైసా లేదంటున్నారు.

నాయడు: పైసాలేకపోతే పనేలా జరుగుతుంది?

రామప్ప: ఒక సంగతి మనవిచేస్తానిలారండి (రామప్పంతులు, నాయడు, వేరుగా మాట లాడుదురు)

రామప్ప: నాయడుగారూ మీ వకాల్తీ యీయన కేమీ సమాధానం లేదు. నే యెంత చెప్పినా వినక భీమారావు పంతులుగారికి వకాల్తీ యిచ్చాడు. మీకు యింగ్లీష్ రాదనీ, లా రాదనీ, యెవడో దుర్బోధ చేశాడు.

నాయడు: స్మాలెట్ దొరగార్ని మెప్పించిన ముండాకొడుకుని నాకు లా రాకపోతే యీగుంట వెధవలకుటోయ్ లా వస్తుంది. పాస్‌పీసని రెండు యింగ్లీషు ముక్కలు మాట్లాడడంతోటే సరా యేమిటి? అందులో మన డిప్టికలక్టరు గారికి యింగ్లీషు వకీలంటే కోపం. అందులో బ్రాహ్మడంటే మరీని. ఆ మాట ఆలందరికి బోధపర్చండి.

రామప్ప: మరి కార్యం లేదండి, నే యెంతో దూరం చెప్పాను తిక్కముండాకొడుకు.

నాయడు: అయితే నన్నిలాగు అమర్యాద చేస్తారా? యీబ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరుగారి బసకువెళ్లి మనవిచేస్తాను.

(తెర దించవలెను)

***

గురుజాడలు

191

కన్యాశుల్కము - తొలికూర్పు