పుట:Gurujadalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1969-70 ప్రాంతంలో ఆర్నెల్లపాటు నార్ల వెంకటేశ్వరరావుగారి పర్యవేక్షణలో పాటిబండ్ల సుందరరావుగారు, గొల్లపూడి మారుతీరావుగారు, కె.వి.రమణారెడ్డిగారు, తుమ్మల వెంకట్రామయ్యగారు పనిచేసి గురజాడ డైరీలను చదివి "మళ్ళీ రాయించటం, టైపు చేయించడం", "క్షాళన కార్యక్రమం" నిర్వహించారు. (పురాణం సుబ్రహ్మణ్యశర్మ, మధురవాణి ఇంటర్వ్యూలు, పుటలు 10, 129). ఈ విషయాన్ని కే.వి.ఆర్. కూడా ప్రస్తావించారు. (మహోదయం, పుట. 435, 2012 ప్రతి).

ఇటీవల శ్రీ గొల్లపూడి మారుతీరావుగారిని కలిసినప్పుడు, వారు తాము గురజాడ రాతప్రతులను చదివి శుద్ధప్రతులను తయారు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నట్లు ధ్రువీకరించారు. ఆ మాటే కే.వి.ఆర్. నాతో (1976లో) అన్నారు. ఈ విధంగా చదివి, టైపు చేయించిన దినచర్య, ఇతర నోట్సు వగైరాల కాపీ, భమిడిపాటి రాధాకృష్ణ తనకు ఇచ్చిన, గురజాడ స్వహస్తాలతో రాసుకొన్న కొండుభట్టీయం ప్రతి - అన్నీ కే.వి.ఆర్. గారివి శ్రీ చలసాని ప్రసాద్ గారికి అందాయి. చలసాని ప్రసాద్‌గారికి అందాయి. చలసాని ప్రసాద్‌గారు ఆ పత్రాలన్నీ 2006లో పెన్నేపల్లి గోపాలకృష్ణకు పంపించారు.

గురజాడ దినచర్య, ఇతర నోట్సు ఇంగ్లీషులో టైపు చేయించిన వాళ్ళు ఆ ప్రతిలో తమకు బోధపడనిచోట, తెలుగు, సంస్కృత పదాలు వచ్చినచోట తరచుగా (...) గుర్తు పెట్టారు.

1895 సంవత్సరానికి గురజాడ రెండు డైరీలను వాడారు. ఒకటి Hoe and Co. వారి డైరీ. రెండోది ఒక మామూలు రూళ్ళ నోట్‌బుక్. ఆ ఏడాది గురజాడ ఈ రెండు పుస్తకాల్లో దినచర్య రాసుకొన్నారు. రూళ్ళ నోట్‌బుక్‌లో మద్రాసులో నాటక ప్రదర్శనలు, బెంగుళూరు సందర్శన వగైరా విషయాలు రాశారు. ఈ నోట్‌బుక్ పేజీలు విడిపోయి, గజిబిజిగా కలగలసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నాయి. మొత్తం గురజాడ దినచర్యలో ఒక్క 1895 దినచర్యే సగభాగంపైగా ఆక్రమించింది.

గోపాలకృష్ణ గురజాడ దినచర్య రాతప్రతులన్నీ మళ్ళీ మళ్ళీ చదివి, తన సంపాదకత్వంలో అచ్చయిన 2009 ప్రతికి ఎన్నో సవరణలు, మార్పులు చేశారు. ఈ దినచర్యకు, గురజాడ లేఖలకు ఆయనే ఒంటిచేతిమీదుగా నోట్సు సమకూర్చారు.

గోపాలకృష్ణ సిద్ధం చేసిన దినచర్య దగ్గర ఉంచుకొని రాతప్రతులతో మరొకమారు నిమ్మళంగా సరిపోల్చి చూశాము. ఈ కృషిలో నాతోపాటు శ్రీ సర్వోదయ కళాశాలలో పనిచేసిన డాక్టర్. ఎం.శివరామప్రసాదు సహకరించారు. గురజాడ జిలుగు రాతను బోధపరుచుకొని మళ్ళీ దినచర్య రాతప్రతులను (Digital Copies) చదివాము. పూర్వం బోధపడక విడిచిపెట్టబడిన