పుట:Gurujadalu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: నీకు డబ్బంటే మతిపోతుంది. అగ్నిహోత్రావధానులకు పద్దెనిమిది వందలు యివ్వడానికి వొప్పుకున్నావు. యిప్పుడు వెయ్యికి నన్ను కుదర్చమంటే నా శక్యమా. పన్నెండువందలకి తక్కువ కుదరదు.

లుబ్ధావ: తేలిపోయిన సంబంధము తేలేపోయింది. మళ్లీ నన్నెందుకు బాధపెట్టుతావు - మరి సంబంధము యెంతమాత్రమూ అక్కరలేదు.

రామప్ప: అగ్నిహోత్రావధానులు నిన్ను ముసలివాడని అగౌరవపరచిన తరువాత రెండువేలు ఇచ్చైనా పెళ్లాడకపోతే లోకం అంతా నవ్వుతారు. మీనాక్షివల్ల వచ్చే వుపద్రం మరచిపోకు, జాతకంలోకూడా రూఢిగా వివాహయోగం, ఆ భార్యామూలంగా గొప్ప ధనయోగం వుంది. నువ్వు అక్కరలేదంటే తప్పుతుందా.

లుబ్ధావ: అయితే సుళువుగా ఎక్కడైనా సంబంధము చూడండి.

కూలిమనిషి: చాలాశేపైంది. బత్తైఖర్చు ఇప్పించండి బాబూ.

లుబ్ధావ: ఈ శుభవార్తకా భత్యఖర్చు, వకదమ్మిడీ ఇచ్చేదిలేదు. ఇంకా శిగ్గులేక భత్యఖర్చు అడుగుతావు.

కూలి : ఆ వూసు నాకెందుకయ్యా. నా కూలి నేను నిలబెట్టి పుచ్చుకుంటాను.

లుబ్ధావ: రామప్పంతులుగారూ చూచారండి, యీ గాడిదకొడుకు పెంకితనం.

కూలి : మాటలు మిగల్నియ్యకండి, ఆ వెనక నేను వూరుకునేవాణ్ణికాను.

(తెర దించవలెను)

***

ఆరవ స్థలము - లుబ్ధావధానుల యిల్లు

కరటక : (తెరవెనుకనుంచి) యత్రబాణా స్సం పతంతీ

లుబ్ధావ: యవరయా వారు?

కరటక: బ్రాహ్మలం మాది కృష్ణాతీరం తలుపు తీయించండి.

లుబ్ధావ: ఏమిటయ్యా వేదము మహావడిగా చదువుతున్నావు. నేను చదవలేనా యేమిటి. వేదము వొక దమ్మిడీ ఇవ్వదు. ఇంగ్లీషు చదువుకోండి.

కరటక: ఒక పనస వినుపించి వెళ్లిపోతాను.

లుబ్ధావ: నేను కావలిస్తే పదీ పనసలు చదువుతాను.

గురుజాడలు

158

కన్యాశుల్కము - తొలికూర్పు