పుట:Gurujadalu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గురజాడ వారి పిల్లల పాట

చింతా చెట్టు చిలకల తోటీ

ఏమని పలికిందీ?


“చిలకల్లారా చిలకల్లారా

 

ఛీ ఛీ పొమ్మందీ.”


కొబ్బరి చెట్టు చిలకల తోటీ

ఏమని పలికిందీ?


“చిలకల్లారా చిలకల్లారా

 

ఛీ ఛీ పొమ్మందీ.”


జామీ చెట్టు చిలకల తోటీ

ఏమని పలికిందీ?


“చిలకల్లారా చిలకల్లారా

రండీ రండందీ.”


మామిడి చెట్టూ చిలకల తోటీ

ఏమని పలికిందీ?


“చిలకల్లారా చిలకల్లారా

రండీ రండందీ.”

(విశ్వవీణ' 1959 డిశంబరు 1వ తేదీ సంచిక నుంచి. చూ : గురజాడ రచనలు, కవితల సంకలనం, సం!! సెట్టి ఈశ్వరరావు, పుట. 78, సప్తమ ముద్రణ, 2007)

గురుజాడలు

119

కవితలు