Jump to content

పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 గృహలక్ష్మి


హిందూమతములో నిట్టి అన్యాయముండబట్టియే 1 స్తవ ఫాదరీలు అట్టి చర్యలను చేయగలుగుచున్నా రనియు మనలో పములను మనము సర్దుకొన్నచో ఎట్టి చిక్కును ఉండదనియు మహాత్ముడు చెప్పెను.

(1) కొందరగ్రజులు కొండరంత్యజులు అనుభావ ముండ రాదు.

(2) ఎవరియిష్టమైన వేషభాషలు వారవలంబించు టకు ఇంకొక రభ్యంతరము చెప్పరాదు.

(3) పూర్వాచారములకు ప్రమాణముగా చూపి వారి శితర హైందవులకు గల హక్కుల ని రాకరించ రా

ఇట్లు చేసినచో విద్వేషములుండవు లేనియెడల హిందూ సంఘము పెక్కు కష్టముల పాలగునని వారికి మహాత్ముడు హెచ్చరిక తెలిపెను.

ప్రశ్నోత్తరములు

ప్ర, మహాత్మా, తామువచ్చినప్పుడు ప్రజ లీహరిజ నోద్యమమునకు సహాయము చేయుదురు. తాము వెళ్లి పోగానే మరిచేయరు కనుక తాము రానప్పుడుకూడ మాకుధనము వసూలయేటట్లు ప్రజలకు బోధచేయ రాదా?

ఉ. ప్రజలను నిందించిన లాభములేదు. మీరు శాంతము శ్రద్ధ పూరి లాభకరమైన పనులను చేయ బూనినచో తప్పకుండా సహాయమువచ్చితీయను.

ప్ర. హరిజన సేవకులకిచ్చు జీతములు అయు కమైన ఖర్చులక్రిందకు వచ్చునా?

ఉ. వారి విద్య ఆరోగ్యము మొదలగు కొరకు చేయుఖర్చులు రావు. ఆఫీసు ఖర్చు లెక్కువయై నచో ఆయుక్త మనవలెను.

ప్ర. హరిజనులు సవర్ణుల సేవకులనియు, వారికి సౌకర్యములు కలిగించుట సవర్ణులకర్తవ్యమనియు పలువురు చెప్పుదురు. ఇది నిజమేనా?

ఉ. ప్రస్తుతము హరిజనులు సవర్ణులకనంతమైన సేవలు చేయుచున్నారు గనుక వారి సౌకర్యములను గూర్చి నిర్లక్ష్యము చేయుట సవర్ణులకు మహాపాతక ము . హరిజనులిపే సర్వదా సేవకస్థితియందుండవలెనని నా యుద్దేశ్యము కాదు.

ప్ర. హరిజనులు పెట్టుకొనవచ్చునా 3 P సవర్ణుల పేరులవంటి పేరులను

ఉ. కొంద రట్లు చేయుచున్నారు కాని నాకిష్ట ములేదు. సవర్ణులు పశ్చాత్తాపపడి వీరిని తమలోకి చేర్చుకొనవలెనే గాని వీరు కృత్రిమనామములను దాల్చి సవర్ణులవలె కనిపించుటకు ప్రయత్నించరాదు.

ప్ర. తమరు స్త్రీలను వారి నగలనిమ్మని చున్నారుగదా పురుషులను తమగర్వసూచకములైన జందెములనిమ్మని ఏలకోర రాదు. కోరు జందెములు

ఉ. రెండింటికిని సామ్యము లేదు. ఈశ్వర సేవకొరకు మానవులు తమ్ముతామర్పించు కొనుటను సూచించు చిహ్నములు. ఇష్టమైనవారు దాల్చవచ్చును లేనివారు మానవచ్చును. నేను దాల్చ లేదు. గర్వసూచకముగ ధరించరాదు. హరిజనులు కూడ వేసుకోవచ్చును. కాని దాని అర్థము తెలుసుకో కుండ వేసుకొనెడి యాచారమునకు నేను ప్రోత్సాహ మాయగోరను, యూ

ప్ర. జాతి భేదము లుండవలెనా? పోవలెనని నా

ఉ. ఒక రెచ్చు ఒకరుతక్కువ అను భావముతో నెవ్వరును జాతి భేదములను పాటింపరాదు. ఈశ్వర సృష్టిలో నందరు నొక్కటే. ఆర్ధికముగా వర్ల సంస్థ చాలాగొప్పది. ఈసూత్రమును పాటించినచో నిరు ద్యోగసమస్య తొలగి అందరికిని వృత్తులు చేకూరును. ఎచ్చుతగ్గు భావములవల్ల అస్పృశ్యతాదోషము సిద్దించుచున్నది. జాతులేకావు మతములుకూడ ఒకటి కావచ్చును. మనకందరకు నీశ్వరుడొక్కడే. అయినను ఈశ్వరునిగూర్చి పెక్కు మతముల వారికి పెక్కు అభిప్రాయము లున్నవి కనుక పెక్కుమతము లుండి తీరును. ఒక మత ముయెడల నొకరికి ఒక జాతి యెడల నొకరికి సహనము స్నేహము ఉన్నచో, ఎచ్చు తగ్గు భావములు లేనిచో ఎట్టి చిక్కులును కలుగవు.