కొండవీటి విజయము
యవి సామాన్యుల కర్థమగుస్థితిలో లేకపోవుట చేత నె సామాన్యులకు పాఠ్యగ్రంథముగ నిర్ణయింపబడక ఉత్తమపఠనీయ గ్రఁథముగ నిర్ణయింపబడుట. ణ 5. ఇక వీగుజేసిన కవిత్వ విమర్శనకు. "శ్రీ వరునిన్సదాశివవిరించులు దాను సృజించి బ్రోవగ సంహరింప జగముల్ వారికిన్ సృజియింప శక్తులిచ్చి కా శ్రీ వరలక్ష్మి శాస్త్రా దల లీలధరించి ననార్ణ మంత్రసం భావితయైనదుగ్గ గృతి భవ్యముజేయ ముంతింతు ణ ముందుగా॥ ఈ పద్యముందు క్రమభ గ దోషమట.
బ్రోచుటకు శ్రీహరుని, సంహరింప సదాశివుని, సృజియింప విరించిని
శ్రీవరాశక్తి సృజించినది. ఇందు క్రమభంగములేదు. రక్షణసంహారసృష్టిళ కు లను వీరికి ప్రసాదించినటుల వర్ణింపబడి యున్నది. అట్టిశ క్తులు గల పై విష్ణు సదాశివ విరించులకు కాళీవరలక్ష్మి శారదలు భార్యలుగ కవి వర్ణించలేదు. వారు నవార్ణ మంత్రరూపియగు దుగ్గ యొక్క అవ తారములు అని మాత్రిమ వర్ణింపబడియున్నది. కాని భార్యలని ఊహించుకున్న వారికి క్రమభంగమని భ్రమకలుగవచ్చును. పద్యమునందుమాత్ర మాదోషము లేదు. నవార్ల మంత్రిమున వరుసగ సరస్వతి లక్ష్మి కాళి బీజములు ఉండుటచేత ఈ కాళీవరలక్ష్మి శారదల పే ర్లిందు నివరింపబడినది. ఈ మూడు బీజముల చే ప్రతిపా దితమగు శక్తులు, వార్ల భార్యలు కానేరదు. ననార్ల మంత్రపతిపాదితమగు దుర్గ అవివాహితకన్య. అంచేత నిచ్చట పై దోషము లేదు.
6. “కవులెనమండ్రు జాతికొక కావ్యము నొక్కిడ నల్ల " "ఇందు మన మెరిగిన యష్టదిగ్గజములు కృష్ణరా యని యాస్థానముననుండిరా లేదా” అని ఒకశంక. ఉండెడివా రనుకొన్నప్పటికి కృష్ణరాయలు కాల మున గ్రంధములను రచింపలేదటవారు. అందు చేత శ్రీ శాస్త్రి గారి మాట యెంతవరకు నిజమో ఆలో చింపవలసి యున్నదట! నిజమో అబద్ధమో అసలు విమర్శకురాండ్రకె ఆలోచించవలసిన విషయమట అనగ నిర్ధారణగ తెలియదన్న మాట, మరియు పద్యమునందు దిగ్గజముల ప్రసక్తియే లేదు. యెనమండుగురు కవులుండిరని మాత్రమె గలదు. కృష్ణరాయ లంతటి రాజునొద్ద ఎనమండుగురు కవులుం డుట ఆశ్చర్యమా? వారు గ్రంథములు రచించి యుండగూడదా ? విమర్శనకు చాల గొప్పవిషయమే దొరికినది వీరికి. ఇక కృష్ణరా దొరికినది వీరికి. ఇక కృష్ణరాయలు అప్పాజీ ని అవమా నపఱచుట అను కాలవిషయమై సందేహమే కలదట. ఎవరికి సందేహము? విమర్శకురాండ్రకేనా? అట్ల యిన చరిత్ర చదువుకొని మరియు విమర్శ చేయవలెను. కృష్ణరాయలు చరిత్ర తెలుగునకంటె నింగ్లీషున యెక్కువగలదు.
7. 18 పద్యము. మ " పెట్టని కోటయై గిరులు పేర్చెను జుట్టు న్నతంబుగా” అని చెప్పుటకంటె కట్టనికోట యని యుండవలసియున్నది.” అని వీరి మరి ఒక ఆక్షేపణ, సరే ' పెట్టని కోటయని' ఎందుచేత నుండగూడదు. భారతమున ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసమున "పెట్టని కోట నీకు హరిభీముడు" అనియు, విజయ విలాసమున " పెట్టని కోటగాదె గజబృందము” అనియు ప్రయోగములు గలవు.
8. ఇక 22 పద్య. “ఖాను లుద్దండులై తన్ను కొలచుచుండు”యను నది అచ్చుతప్పో లేక పొరబాటు గావచ్చును. అట్టిది ఒక ఆ క్షే పణవిషయముగాదు, “తన్ను కాచుచుండ” అని దిద్దుకోవచ్చును.
9. 30 పద్యము. “నా వినిపల్కె రాయలు ఘనంబగు సంగరకాతు కంబునన్ నీ వసహాయశూరుడవు నిక్కమ నీ కరకాశలం దావని నెన్న డే నెచటనైనను జూపకున్న నన్ను నే నే నహివాడనో జగమదెట్టు లెరుంగును రాజు లందునన్ " "