10 గృహలక్ష్మి
గలవు. రోగము బహుదోషయుక్తమగు టైఫాయిడ్ జ్వగ మైనప్పటికిని, చచ్చిపోవువఱకు స్మృతి, నిర్మల ముగానుండెను. కష్టసహనశక్తి అత్యద్భుతము. ఎం బాధపడుచుండినను “అమ్మా! నీ బాధ యెట్లున్నది?” అని యడిగినప్పుడు "కొంచెము నెమ్మదిగా నున్నది వాన్న గారూ !" అని స్ఫుటమైన వాక్కుతో చెప్పె డిది. నామనస్సు కళవళపడునని యట్లు పలికెడిది గాని బాధతగ్గుట చేత గాద. నాకును భర్తగును తల్లికిని అన్నకును వది నెకును ఇతరులకును జెప్పిన చివరహితోక్తులు మహా వివేకసూచకములు. మృతి భీతి అణుమాత్రమైన నగ పడలేదు. భగవన్నామో చ్చారణము చేయుచుఁ బ్రాణములు విడిచిన యా యద్భుతవ్య క్తిని జూచి "అన్నయ్యా! మనకుంది గీతలోఁ జెప్పిన స్థితప్రజ్ఞురాలు గాఁ గానిపించుచున్నది నుమాయని నాతమ్ము ఁ డన్నాఁడు. పుట్టినింటికిని మెట్టినింటికిని కీర్తి తెచ్చిన యాపిల్ల ప్రాణములు నిల్పు కొనుటకై నాస్థితిలో నున్న వానికి సాధ్యమైన యావ త్ప్రయత్నములును చేసినాను. కన్నీళ్లతో నిన్నుఁ దలఁచుకొని ప్రార్థించినాను. జపమాల పై నీ నామ మ సేక పర్యాయములు జపించినాను. అంతయును బూడిదలోఁ బోసిన పన్నీరై పోయినది. మేమో నీవే చెప్పవలెను.
'నీడబ్బు దోష' మందువా? నేనార్జించిన ద్రవ్య ములో నొక దమ్మిడియైనను అన్యాయార్జితము లేదని నీయెదుట నిలఁబడి నీమీఁద నొట్టు పెట్టుకొని చెప్పఁ గలను. “నీకర్మ"మందువా? కర్మము జడము. అదేమి చేయఁగలదు? సర్వశక్తుఁడవును సర్వాధికారిని అగు నీకు కర్మముపై అధికారముండదా? దుష్కర్మ ఫలమును గొట్టివేయఁజాలినశక్తి నీకులేదా? ఉన్నది. ఉండియును కర్మము పేరు చెప్పి జీవుల నిట్లు నీయిష్టము వచ్చినట్లు త్రిప్పులఁ బెట్టుచున్నావు. “నేనొక రాజ మా త్రుఁ డ ను గాని భగవంతుఁడను గారు రా నెత్తి వాఁడా! నిరపరాధుఁడుగు వాలిని నిర్దోషుఁడగు మ. నీ శూద్రతపస్విని జంపినాననియు, మహాసాధ్వియును గర్భవతియునగు కాంతను గాంతారముల పాలు చేసినా ననియు, నాలోపము లెంచుచున్నారు ప్రజలు. భగవంతుఁడు నా పైనాఁడు. అతని సేవింపు" మం గవా? ఈ బొల్లిమాటలకు నే లొంగను. ఎట్లో బాధ్యత తొలఁగించుకొనవలెనని మృపా వాక్యము లాడుచున్నావు. అమూర్తిమంతుఁడును అదృశ్యుఁ డును నైన భగవంతుఁడు సృజించిన సృష్టిలో మాత్రము వైషమ్యనైనృణ్యలక్షణము లెన్ని కనఁ బడుటలేదు? లయకర్తయును రక్షకుఁడును ఒక్క డే యెట్లు కాఁగలడు? నీ చరిత్రలోని సందేహములకంటె సృష్టిక ర్తచరిత్రలోని సందేహము లెక్కువగాఁ గానిపించుచున్నవి. నీవే ఆభగవంతుఁడవు. లోక 'క్షణార్ధము మనుష్యుఁడవై పుట్టితివి. మాయతో మావంటి మనుష్యునివలె నటించితివి. అంతే. ఆభావన నాకుఁబోదు. అది నా ప్రారబ్ధము. కొట్టినతల్లి తమ్ము నే మఱింతగట్టిగా అమ్ము నే మఱింతగట్టిగా వంటిపట్టుకొను బక్క శిశువువలె నేను నిన్ను వదల లేను. తేల్చినను నీవే!! మి ముంచినను నీవే.
నీవు దుర్విజ్ఞేయుఁడవు. “యస్యానుగ్రహమిచ్ఛా” మీ తస్యవిత్తం హరామ్యహమ్ ” అన్న దయామయణ ఁ డవు. నీమా యంతకంటెను దుర్విజ్ఞే యము. నీమాయలోఁ బడవైచి నన్ను బాధింపకుము. ఇఁక నట్టి బాధలు పడుటకుఁ జాలిన దేహబల మనోబల ములు లేవు. ప్రేమ చేతనే నేను జెడిపోవుచున్నానని నీకుఁదోఁచు వెడల, తాతి గుండెయే సుఖజీవనమును కావశ్యకముగు నెడల, నట్లే నన్నుఁ బాషాణహృద యునిజేసి నాకు మనశ్శాంతి యొసఁగుము ! నీయందు ! నాకుఁడు భక్తిని శుద్ధము చేసి దృఢీకరించి నన్ను నీయక్కున జేర్చికొనుము. మమ్మందఱను దుఃఖసాగ రములో: ముఁచిపోయిన మాఅన్నపూర్ణ ఆత్మకు ప్రశాంతిసుఖములను మోక్షానందమును బ్రసాదింపుము. తండ్రీ! యివే నీకు నాళతసహస్ర వందనములు ! వృకసందోహము పొంచియుండి పొలమం దేకాకిగానుండు వృ ద్ధశకుద్మంతము పై కి దూఁకుగతి దుర్దాంతాధులున్వ్యాధులున్, జకితస్వాంతతనుండు న న్న టీమి యేఁచ చొచ్చె! గోపాలనా నన్న మక! రక్షించుట కీవెశక్తుఁడవురమ్మా! రామచంద్రప్రభూ!