పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱేండ్ల గృహలక్ష్మి

ఈ విశాలవిశ్వమునందు భగవాను డెప్పుడు మానవులను స్త్రీపురుషులను ద్వివిధజాతులుగా సృష్టించెనో అప్పుడే వారి వారి స్వభావములు, వారివారి వృత్తులు, వారివారి ప్రయోజనములు, వారివారి కర్మ క్షేత్రములు భిన్నములైనవి. ఎప్పు డివి భిన్నమైనవో యప్పుడే వారికి ప్రతిదానియందును ప్రత్యేకత యేర్పడినది. కావుననే వేషములలో నేమి భాషలలో నేమి, వాక్కులోనేమి వర్తనములో నేమి, సభలలో నేమి సమితులలో నేమి, పొత్తములలో నేమి పత్రికలలో నేమి ప్రతిదానియందును ప్రత్యేకత యావశ్యకమైనది. ఇట్టి ప్రత్యేకత వలదని వాదించెడివారును గలరు గాని జయించినవారుమాత్రము లేరు.

ప్రత్యేక పత్రికావిషయమున నాంధ్ర స్త్రీల నోములు మొన్న మొన్నటివఱకు కొఱ నోములుగానే యు౦డెను. స్త్రీలయభ్యుదయము నిమిత్త మెన్నియో పత్రిక లుదయించెను. కాని యవి నిరంతరాయముగా జీవించినది మాత్రము లేదు. పత్రికా ప్రయోజనమును బొత్తిగా గుర్తింపని యాధ్రదేశమున నిస్సహాయలగు నాంధ్ర స్త్రీలకొఱకై యుదయించిన పత్రిక లెట్లు జీవింపగలవు? విశేషముగా కాకపోయినను కొలదిగానైన నాంధ్ర స్త్రీలలో చక్కగా చదువగలవారుండిరి. వ్రాయగలవారుండిరి. గేయములు రచింప గలవారుండిరి. కావ్యములల్లగలవారుండిరి. చిత్రములను చిత్రింపగలవారుండిరి. శాస్త్రములను విరచి, పగలవారుండిరి. శిశువాజ్మయమును సృష్టింపగలవారుండిరి. ఈవిధముగా వివిధ విద్యలను గుశలలైన స్త్రీలున్నను వానందఱ నొక్క తావున జేర్చి వారి పాండితవిభవమును, నారికళాకౌశలమును, వారియనుభవజ్ఞానమును లోకమున వ్యాప్తముసేయగల పత్రిక యొక్కటియే కొఱతగా నుండెను. గృహలక్ష్మి యుదయించుటతో నాంధ్ర స్త్రీలకా కొఱతగూడ దీరినది. ఆంధ్ర మహిళల భాగ్యరేఖ యొకటి బయటపడినది. స్త్రీల యారోగ్య సౌభాగ్యముల వర్థిలజేయుటయే గృహలక్ష్మి ముఖ్యాశయము. ఈ యాశయమును సర్వవిధముల సాఫల్య మొనర్చుకొనుచు గృహలక్ష్మి యాంధ్రదేశపు నలుమూలల విహరించుచున్నది. స్త్రీల పత్రికయని తిరస్కరింపబడక పురుషుల మన్ననగూడ బొందుచున్నది.

సారస్వత విషయమున గృహలక్ష్మి గ్రామ్య గ్రాంథికవి భేదము లెఱుగదు. కవిత్వ విషయమున పురాతనాధునాతనకవిత్వములు రెండును గృహలక్ష్మికి సమ్మతమే. మతవిషయమున గృహలక్ష్మి పక్కా హిందువు సాంఘికములందు గృహలక్ష్మి భావము లతివిశాలములు. పసినిసుంగులకు పెండ్లి చేయుడినిగాని, బాలవితంతువు , పీడించుడనిగాని, వరశుల్క కన్యాశుల్కములు స్వీకరించుడనిగాని, హరిజనోద్ధరణ మనావశ్యకమనిగాని గృహలక్ష్మి యెప్పుడును