స్వవిషయము
కాశములేదు. మెలఁకువతోడనే మెలఁగవలసి యున్నాది.
మరి మొదటినుండియు నిది రాజకీయ రంగములయందుఁ బెద్ద పెద్ద పరువులు వార లే కుండుట బాల్యదశాదోషమే! కాని యీ దోష మిటులుండవలసినదే యేమోనను నను మానము కలుగుచున్నది. ఈ యనుమాన నివర్తి కేమి" యెగదుడుపులు దిగదుడు పులు” చేయవలయునో తెలియక మేమే సందిగ్ధానస్థయందున్నామ . కాఁబట్టి“యెప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి 66 నీవు యన్యులమనములు నొప్పింపక నొవ్వక తప్పించుకు తిరుగు” మని ధైర్యము చెప్పుచున్నాము. కాని పరమాస్వతంత్ర యైన బాలికకు మనసులోనిదిగులు మాసి పోవుటకల్ల.
ఈ విధముగా సాంఘిక, నైతిక, మత, రాజకీయాది విషయములయందు మన యీ గృహలక్ష్మి పరిపూర్ణముగాఁ గృతికృత్య యగుటకుఁ జాలినంత కాలమునే సంభావింపు చున్నాము. అదియును విజయము నిశ్చయిం చుకొన్న వారమై !!
ఎందువలన? వయోవిజ్ఞానవృద్ధులను పెద్దలు, "కాలములు గడసిన కత్తిపీట”ల వంటివారు మాకు సలహాదారులని. మరియు ననురక్తి శ క్తియుక్తులగు యువయువతీ మణుల నిరంతరసహాయప్రోత్సాహములవలనఁ గొంత వఱకు మాకు “వాగర్థప్రతిప త్తియొన గూడు చున్నదని.
తస్మాత్తు శక్తిధ్వజమునుబూని, శారదా శస్త్రహస్తయై లక్ష్మీప్రభాకలితయగు నీ యార్య “గృహలక్ష్మి'ని వినయముతో యధాపూర్వముగ మీ చేతులఁ బెట్టుచు న్నాము. కృతజ్ఞతా బద్ధులము. మాయెడ దయాభిమానములు చూపి దీని పరివ్యా ప్తికై తాము చేయవలసియున్నది కూడ నెంతో కలదనియు నెఱుకఁ జెప్పుచున్నాము. ఏవంకఁ జూచినను ఆర్థికవిషయములఁ గూర్చి హాహా కారములే వినవచ్చుచున్న యిట్టి విషమ పరిస్థితులయం దైనను గృహలక్ష్మీ యంద చందముల కేమాత్రపు లోపమునై నఁ గలుగ కుండనిఁక విూదుమిక్కిలి దీనిని నానాటి కధిక తర సౌందర్యవతినిఁగాఁ జేయుటకే మనసార యత్నములు సేయఁబడుచున్నవి. ఇట్టియత్న ములయఁదుగూడఁ గవులును జిత్రకారులును నిరంతర సహాయముఁ జేయుచునే యున్నారు. కాని యిట్టి సహాయ మొకప్పుడు మాకుఁ బనికి రాక పోవుచున్నది. దేశకాలపరిస్థితులఁ బట్టి స్త్రీ సమాజమును అటు పరమ పురాతనపద్ధతినుండియు నిటు పరమపాశ్చాత్య సరణినుండియుఁ ద్రిప్పి యీ రెంటికిని మధ్యమ మగు నొక త్రోవలో నడపించుటయే, దేశాభ్యుదయ పరంపరావాప్తికి ప్రథమోపాయ మని మా విశ్వాసము. ఇట్టిదానికిఁ బ్రతికూ ల్యత వాటిల్లునెడ మాకు మౌనముద్రయే శరణ్యమగుచున్నది. ఒక్కొక్క యెడ నుదాసీ నతయుఁ బూనవలసి వచ్చుచున్నది. ఇట్లుం డుటవలన మాయెడఁ జేయఁబడు కన్నెర్ర లను జూచి “శా న్తము లేక సౌఖ్యములే””దని పాడుకొని యానందించుచున్నాము.