Jump to content

పుట:Grihalaxmi, sanputi 7, sanchika 1.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2 గృహలక్ష్మి

ములయందే యీగృహలక్ష్మి తాండవముఁ జేయుచున్నది కాని పల్లెటూరి 'పార్వతమ్మల' కడకుఁ బోఁజాలకున్నది. ఏలయన నాసోదరీ వలనఁ దానాశించిన వెనుకదన్ను చాలక. పోనీ వీరి నిట్లుండనిచ్చి యింక వీరి కంటె విశిష్టలగు నాగరక భగినీజనముల కడకుఁ బోవుదమన్న, వారు దీని మోమైనఁ గనరు. వారిభాషలు విజాతీయములు. వారి భావములు మేరలు విరియున్నవి. ఇంక నేమిదారి? ఎత్తుచున్న తల ద్రింపఁజాలదుకదా! బాలిక యేయయ్యు మానాభిమానము మెండుగాఁగలది. కాఁబట్టి వెళ్లినదారినే తిరిగిరాక సామవాదములతో నిట్టి విశిష్ట నాగరక యువతులఁ దనవారిగాఁ జేసికొని యావలఁ గ్రమక్రమముగఁ దొంటి 'పల్లెటూరి పార్వతమ్మల’తో బంధుసఃణి నెఱపవలసియున్నది. తమ కిది యిష్టము లేకున్నను లోక సంగ్రహమునై నఁ బాటించి యీ విశిష్ట సహోదరీమణులు ఈ గృహలక్ష్మీం బలుకరించి భాషంత్రుగాక !

తమ సువిశాల సరస్వతీభ వనములయం దీ తెనుఁగు బిడ్డ కొకింత చోటిత్తురుగాక! అటులై నవో నీ బాలిక కొక లోపము పోవు నళి మాయభిప్రాయము.

ఇఁక నైతికముగా, నిది పల్కు చున్నవి. జిలిబిలి ముద్దుమాటలే యైనను “పిన్ని చేలి దివ్వె పెద్దగా వెలుగదా” యను యధార్థమును బాటించి హృదయపూర్వకముగ వినుచున్న వారలు పలువురున్నారు కాని యంత మాత్రము చాలదు.

" ఎఱుకగలవారి చరితలఁ గఱచుచు సజ్జనులగోష్టిఁ గదలకధర్మం | బెఱుఁగుచు నెఱిఁగిన దానిని మఱువు కనుష్ఠించునది సమంజసబుద్ధి ||"

అనున ట్లాచరణయే నీతిశ్రవణమునకు ఫలము, అది పెక్కుచోట్ల ననుకొన్నం లేదు, మన యీ “గృహలక్ష్మి' వయసు మీరినకొలఁది తన సహోదర సహోదరీ లోకమును దశవశము చేసికో గలదేమో యింకను జూడవలసియేమున్నది. ఇంతతోఁ దీరలేదనియే మాయాశయము. భ్రూణహ త్యాది మహా పాతికవాసన లింకను దఱచు గానే కొట్టుచున్నవి. శివశివాయని 'ముక్కూ చెవులూ' మూసికొనవలయునేకాని నోరెతి గట్టిగా నేమియు సనరాదుగదా ! "ముక్కు. గోసికొన్న నెత్తురు నోటిలోనికి వచ్చుట” నిజముకదా! కాఁబట్టి "కాలమన్ని యుం జేయుచుచుండుఁ; గాలము విచిత్రము దు స్తర మెట్టివారికి" యని కాలమునే యనుసరింప వలెను గాని వేగిరింపరాదు.

ఆస్తికతా మధ్యముననే పుట్టి యల్లారు ముద్దుగాఁ బెరుగుచున్న “గృహలక్ష్మి" యిఁక “మత విషయమున నేమి యొకరిచి నది ?” యని యోచింతమా, అది సర్వజన సమ్మతమగు మతముననే నడచుచున్నది. ఇట్టి వర్తమాన ప్రవర్తనముఁ బట్టియే భవిష్య త్తునుగూడ నెంచి నిశ్చింతతో నుండవచ్చును; . కాని యట్లుండుటకు వీలులేదు. సనాతన భయ మింతసుళువుగాఁ బోవునది కాదు కాఁబట్టి ‘నెగ్గితి' నని యిది విఱ్ఱవీఁగుట కవ