నుండగలవని తోచుచున్నది. ఒక్కొక్క ప్రాంతమునునిర్ణయించుకొని, నలుగు రైదుగురు ఉత్సాహపూరిత హృదయులగు గ్రంథాలయాభిమానులు కలసి, గ్రామగ్రామమున బసచేయుచు, భజనల మూలమున గ్రామఫోనుమూలమున గ్రామప్రజల నొక్క చోట సమావేశపఱచి, ప్రబోధన మొనర్చి,గ్రంథాలయమున్నచోట దాని నెక్కువ ప్రయోజనకారినిగా జేయువిధానములు సూచించియు, లేనిచోట గ్రంథాలయమును స్థాపింప ప్రోత్సహించియు, యాత్రను సాగించినచో, ఉద్యమవ్యాప్తి చక్కగ స్థిరముగ శీఘ్రముగ జరుగగలదని తోచుచున్నది. ఈ జిల్లాయందు తాలూకాసంఘములు, జిల్లాసంఘము నెలకొల్పబడి పనిచేయుచున్నవని వినుటకు సంతోషించుచున్నాను. కొన్ని తాలూకా సంఘములు తాలూకాసభలను జగ పుచున్న వనియు తెలియుచున్నది. కొన్ని గ్రంథాలయములకు సొంత భవనములు కూడ కలవని తెలియుచున్నది. తెనాలి తాలూకాలో సుమారు 12 గ్రంథాలయములు స్వకీయ భవనముల గలిగియున్నవని వింటిని. కావూరులో “భారత సేవకమండలి" అను గ్రంథాలయమునకు కొంత భూవసతియు స్వీయభవనమును కలవని వింటిని. కాని అచ్చటి గ్రంథాలయమును మాత్రము ప్రజలెక్కువగ నుపయోగింపలేదని యిదివరలో సూచించి యున్నారు. ఇపుడెట్లున్నదో తెలియదు. గ్రంథాలయములకు సొంత భవనము లుండుట అవసరమే. కాని గ్రంథాలయమును స్థిరముగా జరుపగల వసతులున్న చోటనే సొంత భవనములకు యత్నముచేయుట మంచిది. మరియు ప్రతి గ్రంథాలయమును 1860 వ సంవత్సరం 21 వ ఆక్టుక్రింద రిజిస్టరు చేయించుకొనుట అప్పుడు ఆస్తిని సంపాదించుకొనుటకు సంఘము పేర వ్యవహరించుకొనుటకు అవకాశము కలుగును. గ్రంథాలయ రిజిస్టేషనుకు ఫీజును తగ్గించి తక్కు సవ్యయముతో రిజిస్టరు చేసుకొనుటకు సౌకర్యమును గల్పింపమని మనము ప్రభుత్వము వారిని కోరవలయును.
పంచాయతీబోర్డులు, మునిసిపాలిటీలు, జిల్లా బోర్డులుకూడ గ్రంథాలయోద్యమమునకు సహాయపడ వలయును. వారు వ్యయము చేయు ఇతర వ్యయములతోపాటు గ్రంథాలయస్థాపనమునకు, పోషణమునకు వలసిన ద్రవ్యమును వారు వ్యయపఱచుట వారి విధ్యుక్తధర్మమని ఆయా సంస్థల నిర్వాహకులు జ్ఞప్తి యందుంచుకొనవలెను. తమ పరిపాలనకు చెందిన ఆవరణములో నెలకొల్పబడిన గ్రంథాలయములకు వారును వ్యసహాయము చేయుటకు ప్రభుత్వమువారాక్షేపింపకూడదు. జాతీయ భావప్రదర్శనమునకు తరుణ మాసన్నమైనప్పుడనేక పర్యాయములు నిర్భయముగ నద్దానిగన్పరచి యితర మున్సిపాలిటీలకు మార్గదర్శకులై స్తుతిపాత్రులైన గుంటూరు మున్సిపల్ కౌన్సిలువారు సార్వజనిక గ్రంథాలయమును స్థాపించి పోషించుచుండుట ప్రశంసనీయము. వీరి మార్గము నితర స్థానిక సంస్థలును అనుకరించిన బాగుండునని తోచుచున్నది. సహకార సంస్థలును తమ సాముదాయిక ప్రయోజన నిధిని గ్రంథాలయముల కొసంగి గ్రంథాలయోద్యమమునకు తోడ్పడవలయును. ఈవిధముగ నెల్ల ప్రజాసంస్థలు తదేక దీక్షతో గ్రంథాలయోద్యమ వ్యాపనమునకు సహకారమొనర్చినగాని గ్రామప్రజలను విజ్ఞానవంతులుగ జేయుటకు తగినన్ని తృప్తికరమైన గ్రంథాలయములు ఈ బీద దేశపు గ్రామములలోను పట్టణములలోను నెలకొనజాలవు, వృద్ధిపొందజాలవు, పోషింపబడనేరవు.