Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాత్రి పాఠశాలలను నిర్వహించు చుండుట శ్లాఘనీయము. గ్రంథాలయములు విద్యావ్యాపకమున తమ బాధ్యతను గుర్తెఱింగి తమ కార్యభాగమును నిర్వహింపక తప్పదు. “గామములకు మరలుడు!" అను ఘోష ఎచ్చట జూచినను అనధికారవిద్యాధికుల వాక్కులనుండియే గాక యధికారుల ప్రబోధములనుండి కూడ వెడలుచున్న యీ తరుణమున, యువకులను విద్యావంతులు వేలకొలది పనులులేక నిరుత్సాహులై ఆధునిక విద్యావిధానపద్ధతిని నిందించుచున్న యీతరుణమున, గ్రామవాసులలో నిరక్షరత్వమును అవకాశములను రూపుమాపుటకు యువకులకు గల్పించుటయందు గ్రామ గ్రంథాలయములును మార్గ దర్శకత్వమువహించుట అవసరము నపేక్షణీయమును. గా పట్టణములకన్న గాములవంకనే విద్యాధికులగు యువకులదృష్టి యెక్కువగ ప్రసరింపవలసి యున్నది. భారతీయులలో నూటికి 89 మంది గ్రామములలో నివసించువారై యున్నారు.నూటికి 11 మంది మాత్రమే పట్టణములలో నివసించువారు. విదేశములకును మనకును ఈ విషయమున వ్యత్యాసము చాలకలదు. ఇంగ్లండ్ అండ్ వేల్సులో నూటికి 20 మంది గ్రామములలో, 80 మంది పట్టణములలో నివసించువారు. అమెరికాలో యునై టెడ్ స్టేట్సులో నూటికి 44 మంది గ్రామములలో, 56 మంది పట్టణములలో, ఫ్రాన్సులో నూటికి 51 మంది గ్రామములలో,49 మంది పట్టణములలో; కెనడాలో నూటికి 53 పట్టణములలో, 47 మంది గ్రామములలో నివసించువారు. మన గుంటూరుజిల్లా సంగతిని విచారించిన, ఈ జిల్లా యొక్క మొత్తపు జనసంఖ్య 20,35,660 లో 2,78,365 మంది పట్టణములలో, 17,57,295 మంది గ్రామములలో నివసించుచున్నారు. అనగా నూటికి 13 మంది పట్టణములలో, 87 మంది గ్రామములలో నివసించుచున్నారు. కాబట్టి గ్రామములనెట్టి దేశశ్రేయోభిలాషియును పేక్షింపజాలడు. కాబట్టి వారినుద్ధరించి విజ్ఞానవంతులుగ జేయ సమకట్టనిదే దేశ మెంత మాత్రము అభివృద్ధి నొండజాలదు. అందువలననే గాంధీ మహాత్ముని గ్రామ పారిశ్రామికోద్ధరణ సంఘమువారి కార్యప్రణాళికయు, దాని ననుసరించుచున్న ప్రభుత్వము వారి కోటి రూప్యముల గ్రామ పునర్నిర్మాణ కార్యప్రణాళికయు నేడు గ్రామములపై నెక్కువ దృష్టిని ప్రసరించియుండుటయని మనకు స్పష్టము. రాత్రిపాఠశాలల నిర్వహించుటయే గాక, గ్రంథాలయములు గ్రామ ప్రజలకు చేయతగిన సహాయము లింకెన్ని యో స్ఫురింపగలవు. ఉచితముగ ఔషధ సేవ చేయుటకును బీదలకు అపుడపుడు అన్నదానము చేయుటకును, కొన్ని గ్రంథాలయములు పూనియున్నవి. కుముదవల్లిలో శ్రీ వీరేశలింగకవి సమాజము వారిట్టి సేవ చేయుచున్నారు. వారి గ్రంథాలయము 1897 సం||రం జూన్ నెల 22 తేదిన స్థాపింపబడి యీ 38 వత్సరములుగ శ్లాఘనీయమగు కార్యక్రమమును సాగించుచున్నదని వినుటకు సంతోపించు చున్నాను. ఇట్టి కార్యవిధానములను వీలైన చోట్లలో గ్రంథాలయములు ఆచరణలోనికి తేవచ్చును. అపుడు ప్రజలకు వీనియందు ప్రేమ కలిగి, వలసిన ధనాదిసహాయములు లభ్యపడి గ్రంథాలయములు యెక్కువ ప్రజానురంజకముగ జనోపయోగకరముగ విలసిల్లగలవు.

గ్రంథాలయములకు గ్రంథముల సేకరించుటలో నెక్కువ విచక్షణతతో కార్యనిర్వాహకులు వర్తించుట అవసరము. గ్రంథముల సంఖ్యనెట్లేని పెంపొందించవలెనను ఆశతో మెలంగ