థాలయమునకును ప్రత్యేక భవనములు అవసరమని నేను మనవిచేయుచున్నాను. దేశమునందెన్నియో మార్పులు రానున్నవి. వానిలో స్త్రీ జనాభ్యుదయముకూడ నొకటి. పరిపాలనమునందు స్త్రీలకు ప్రాతినిధ్యము లభించినది. ఇంకను లభింపనున్నది. కావున వారుగూడ పురుషులతో బాటు సమానమగు విజ్ఞానము కలిగియుండుటవసరము. కావున ప్రతిగ్రంథాలయములోను స్త్రీలకు తగిన సౌకర్యములను కలిగించవలెనని నాప్ర్రార్ధన. ఇప్పటికి నేను గడువుమీరి యుందును. కావున నపర భారతమూర్తులగు మీకందరకు శ్రమకలిగించినందులకు క్షమాపణ వేడుచున్నాను. మా ఆహ్వానములను మన్నించి యిచటికి దయచేసి మమ్మానంద పరచిన సభ్యులెల్లరకు సంఘముపక్షమున ధన్యవాదము లర్పించుచున్నాను. ణ భాషారాజ్యాంగవేత్తలగు మీరెల్లరు పై సందర్భములు విచారించి ధర్మనిర్ణయము గావించుచు మాసేవాధర్మమునకు మార్గదర్శకులును, సహాయులు నగుటకు ప్ర్రార్ధించుచు నీవినపమును ముగించుటకు సెలవు కోరుచున్నాను. మహాశయులారా! పునరభివాదములు.
గుంటూరు మండల గ్రంథాలయ దశమ మహాసభ, రేపల్లె
మహాసభను ప్రారంభించిన
మన్నేపల్లి రామకృష్ణరావు పంతులు గారి
ఉపన్యాసము
గ్రంథాల యోద్యమాభిమానులారా!
ఈ గుంటూరుమండల గ్రంధాలయ దశమ మహాసభను ప్ర్రారంభించు సంతోషకార్యమును నాయందునిచిన మీ యాహ్వాన సంఘము వారి కనేక కృతజ్ఞతాపూర్వక వందనములు. ప్రక్కమండలమగు నెల్లూరుజిల్లాలో గ్రంథాలయోద్యమమున మేముచేయు కొలదిపాటి సేవను మీరు గమనించి, మా మండలగ్రంథాలయోద్యమ సేవకుల గౌరవింప నెంచినయుదార ప్రేమాతిశయము లేనన్నీ కార్యమునకు నియోగించుటకు ప్రేరించి యుండనోపునని భావించుచు, నేటిసభలో పాల్గొని యీయుద్యదనుభవపరులగు మీ వలన నూత నాంశముల నేర్చుకొన నాకు అవకాశ మొసంగిన మీ యాహ్వాన సంఘ సభ్యులకు మఱల ప్రణామము లర్పించుచున్నాను.
1910 వ సంవత్సరం డిసెంబరు 29 తేదిన నేను సహాయ కార్యదర్శిగా నుండగా నెల్లూరు ప్రోగ్రెసివ్ యూనియనువారు తిక్కన గ్రంథాలయమును స్థాపింప మహాజనసభలో తీర్మానించినప్పటినుండియు, నీ గ్రంథాలయోద్యమముతో నాకు సంబంధముకలిగినది. నాడు 450 గ్రంధములతో బ్రారంభింపబడిన ప్రోగ్రెసివ్ యూనియను వారి గ్రంథాలయము, నేడు 8000 వేల ఆంగ్ల, ఆంధ్ర సంస్కృత గ్రంథములతో విరాజిల్లుచు,మండలీయుల ఆదరణ నెక్కువగ బడసి విజ్ఞానమును వెదచల్లుచు, నిర్విఘ్నముగ నానాటికి వర్ధిల్లుచున్నది. మా మండలములోని రెడ్డికులా