మహాసభలు ప్రారంభింపబడినవి. ప్రజలత్యుత్సాహముతో బాధ్యత వహించుచుండిరి. కాని ఆంద్రులు ధులు ఆవేశప్రియులు. అప్పటికి భారత దేశమునకు మహాత్ముని స్వాతంత్య్ర శంఖారవము భోరు కొన్నది. "దేశమునందలి అన్ని యుద్యమముల దృష్టియు అమహోద్యమము వంకకు మరలినది. విశ్వమానవ కళ్యాణములకు ముఖ్యముగా భారత కళ్యాణమునకు గావింపబడుచున్న యీ శాంతిసమర మితర కార్యోత్సాహములకు చోటీయక పోవుటచేత గ్రంథాలయోద్యమము మందగించినది. రాష్ట్రీయ గ్రంథాలయ నిర్మాణ ప్రయత్నములు చల్లబడినవి. గ్రంధాలయ సర్వస్వము, పాఠకుల కనుమొరింగినది. అనేక గ్రంథాలయములు పుస్తకములు పాఠకుల చేతులలో చిక్కుపడుటచేత శిథిలములు, నామావశిష్టములు కావలసివచ్చెను. ఈమండలమున మనతో గూడకలసి పనిచేసిన గ్రంధాలయములెన్నియో నిర్జీవములు, రూపరహితము పోవలసి వచ్చినందులకు మనమందరమును దుఃఖపడవలసియున్నది. ఇట్టి విషమ పరిస్థితులలో కూడ ప్రత్యేక శ్రద్ధ వహించిన గ్రంథాయాభిమానులకు నాధన్యవాదములు. ఈ నూతన యుగమున గ్రంథాలయోద్యమము కూడ సర్వ సామాన్యజనులకు సహాయముగా నుండి వారియభివృద్ధికి తోడ్పడవలెను. ప్రతి గ్రామమునకు మంచినీటి బావి యెంత ఉపయోగమో, ప్రతిమానవ శరీరమునకు వాయువెంత ఉపయోగమో, మానవులకు గ్రంథాలయములు కూడ అట్టివేయని తలంచవలెను. ప్రతిమండలమందును, ప్రతిఖండము లేక సీమయందును, ప్రతి గామములోను ప్రచారము గావించి గ్రంథాలయములు స్థాపించ ప్రయత్నించవలెను. లేనియెడల గ్రామజీవితము అభివృద్ధిపొందనేరదు. గ్రంథాలయ సేవయే ప్రజాసేవ. యువకులు,పెద్దలును, కూడ నీ యుద్యమములో పనిజేయుట కవకాశమున్నది. మనోవికాసమే జీవనాధారము. ఉత్సాహము, మనోవికాసములేని జీవనము నిరరకము. కావున ఓ సోదర సోదరీమణులారా!గ్రంథాలయాభిమానులగు మిమ్ములను నేను ప్రార్ధించునది యేమనగా: ప్రతి గామమునను గ్రంథాలయములను నిర్మింప వేడుచున్నాను. గ్రంథాలయములు ఆటస్థలములు కాకూడదు. గ్రంథాలయమున గ్రంథపఠనముగాని పత్రికా పఠనముగాని యితర సాహిత్యప్రసంగములుగాని యుండవలెను. గ్రంథాలయాధికారులు నెలకొక సరియైన విద్యావిషయక ప్రసంగము చేయుటకు సభ్యుల కవకాశము కలుగ జేయవలెను. మరియు ప్రస్తుతదశ సంచలనములో గ్రంథాలయోద్యమముకూడ ముఖ్యస్థానము నాక్త్రమించవలెను.
గ్రంథాలయ సేవకులు ఓర్పు, పట్టుదల, ఉత్సాహముకలిగి యుండవలెను. గ్రంథాలయోద్యమాభిమానులు గ్రామములోని యితర సంస్థలలో తగుల్కొని యుండక నిరాడంబరముగ పనిజేసినచో విశేషఫలితము చేకూరును. దేశముయొక్క సమిష్టి ఆదర్శమునకు వెనుకాడు నేసంస్థయు అభివృద్ధి పొండజాలదు. అస్పృశ్యతాకొక నిర్మూలనమున కొకతీరుగడ నేటి కగుపించు చున్నది. అది అత్యవసరమని ప్రముఖులందరు గూడ నంగీకరించుచున్నారు.
ప్రస్తుతము గ్రంథాలయములకు స్వంత భవనములుచాలా అరుదుగా నుండుటచేత అస్పృశ్యులనబడు వారికి గ్రంథాలయ ప్రవేశమునకు అభ్యంతరములు కలుగుచున్నవి. అది సమకూరని నాడు, జాతీయతానిర్మాణము ప్రహసనము మాత్రమే యగును కావున దానికి మనము తోడ్పడుటకును గ్రంథాలయముల సమిష్టి సౌభాగ్యములను చెదరగొట్టకుండుటకును ప్రతి గ్రం