Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథాలయోద్యమము

పైశీర్షికతో హైద్రాబాదు బులెటినుపత్రిక గ్రంథాలయములకు సహాయము చేయదలపెట్టి ప్రభుత్వమువారు చేయుచున్న విచారణలపై వ్యాఖ్యానముచేయుచు నిట్లువ్రాయుచున్నది.

"ఇంత కాలమునుండికూడ, ప్రజలును, పత్రికలును గ్రంథాలయోద్యమమునకు సహాయము చేసి యీ రాష్ట్రమున విద్యాభివృద్ధి చేయవలసిన అవసరమును అవకాశమును చిక్కినపుడెల్ల ప్రభుత్వమువారి దృష్టికి తెచ్చుచునేయుండెను. ప్రజావిద్యా మహాసభయు, ఆంధ్ర మహాసభయు, ఈవిషయమై ప్రత్యేకముగ నొక్కి చెప్పినవి. తుదకు ప్రభుత్వమువారు అన్ని విధముల విద్యావిధాన సంస్కరణమును గూర్చి ఆలోచించు సమయమున అట్టిది ది యెంత మంచిదో గ్రహించి నందుకు సంతోషించుచున్నాము. ఇక్కడ విద్యావ్యాప్తి చాలమందగతిగనున్నదనునదియు,విద్యావిహీనతను త్వరగా పారద్రోలవలసినచో పాఠశాలలలోను, కళాశాలలలోను జరుగుపనికి దోడుగా గ్రంథాలయోద్యమము గూడ చేర్చబడవలెననునదియు స్పష్టవిషయములే. ప్రభుత్వమువారు ఈ ఉద్యమమునందు ఆదరము గలవారుగనేయున్నారని తెలియుచున్నది. అందుకు వారినభినందించుచు అట్లు చేయుటలో ఆంధ్రమహాసభ వారినికూడ అభినందించుచున్నాము. పోయిన డిసెంబరు నెలలో ఖమ్మంమెట్టులో జరిగిన ఆంధ్రమహాసభయందు ప్రభుత్వమువారిని బరోడాలోనున్నట్లే గ్రంథాలయోద్యమమును ఈరాష్ట్రమునకూడ ప్రారంభించ వలయుననియు, ప్రజలచే నిర్వహించబడు గ్రంధాలయములకు షాహి,మునిసిపల్, లోకల్ ఫండు నిధుల నుండి సహాయము చేయవలయుననియు ప్ర్రార్థించు తీర్మాన మొకటి చేయబడి యుండెను గదా! ప్రభుత్వమువారు ఆతీర్మానముపై నింతత్వరగా చర్య గైకొనిరనునది ఆంధ్రమహాసభకు నితరులకు లభించని కొంత గొప్పతనము లభించుటయేయగును. కొంతమంది ప్రజానాయకులకు ఆంధ్రమహాసభను సమావేశ పరచిన వారు సదరు మహాసభను సమావేళ పరచుటకు ముందుగ ప్రభుత్వము వారు విధించిన కొన్ని షరతులకు అంగీకరించియుండుట నల్ల మహాసభ, కోరిక సిద్దించలేదనియు మేమెఱుగుదుము. ఆంధ్ర మహాసభ మితవాదపక్షియులగు ప్రజానాయకులచే నడుపబడు సంస్థయని ఒప్పుకొనుచు మేము అమహాసభ మితవాదాభిప్ర్రాయము గల్గియుండుటవలన మాత్రమే దాని పలుకుబడి సాగుచున్నదని విశ్వసించుచున్నాము. ఈ సందర్భమున మేము ప్రజావిద్యామహాసభ యొక్క స్థాయిసంఘము వారు ప్రస్తుతము తమకు ప్రభుత్వమువారికి మధ్యగల అంతరమును దాటువిషయమై త్వరలో నేదో యొక తీర్మానమునకు రావలసినదని సూచించగోరుచున్నాము. మహాసభను సమావేశపరచుటకు ముందుగ నగదు జమానతు నీయవలసినదని ఒక షరతును అధికారులు విధించినారు. ఇది మాకును చాల విచారకరము. అయినను అనిష్టములగు షరతుల కోర్చు కొనియైనను ప్రజాహితమునకై పనిచేయుటలోనే వివేకముగలదు. ప్రజామహాసభ చాలకాలము నుండి ఆందోళనావస్థలో నేయున్నది. ఇందుకుగల కారణములు దానివశమున లేవు; వాస్తవమే. కాని ప్రజాహితము ప్రధానముగనుక ఆసభవారు ఆవిషయమును దృష్టిలో నుంచుకొని అధికారులు వారిసహాయము లేకుండ విద్యాసమస్యలపై తీర్మానించ కుండుటకుగాను యిష్టముకాని షరతులుకెనను అంగీకరించవచ్చును. ఈ సూచనను మేము ప్రజామహాసభ యొక్క స్థాయిసంఘమునకేగాక ప్రభుత్వము వారికిని జేయుచున్నాము. ఏలయన: ఇరువురి సహకారమువల్ల మాత్రమే యి రాష్ట్ర మందలి విద్యాసమస్య అధికారులకును ప్రజలకును ఉభయులకును తృప్తికరముగ పరిష్కారము కాగలదని మాకు తోచుచున్నది.