Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.8 (1935).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

19

వి భారత దేశ విద్యాహీనత మల్లెల శ్రీరామమూర్తి, సహాయ కార్యదర్శి, ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘము, బెజవాడ. సమ స్తవిద్యలతో తులతూగి ప్రపంచానికి ఆదర్శపాయమై అఖండఖ్యాతి వహించిన భారత వర్షం నిఖిల ప్రపంచంలో ఈనాడు ముఖ్యంగా విద్యావిషయంలో వెనుకబడి వుండడమే కాదు; అధోలోకంలో వుంది. స్వతంత్రత గలిగిన పాశ్చాత్య దేశాల్లో 100కి 90 మంది చదువుకున్న వాండ్లుంటే పరాధీనతలోవున్న కారణంవల్ల భరతభూమిలో విద్యవచ్చినవాళ్ళు 100 కి 10 మంది బొటాబొటిగావుండడంవల్లనే మన దేశంలో విద్యాప్రచారం ఎంత అధమస్థితిలో వుందో సులభంగా గ్రహించవచ్చును. దాదాపు 150 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో కలిగిన ఫలితం యిలావుండి విద్యావిషయంలో! పా పాశ్చాత్య దేశ ప్రభుత్వాలు బాలురకు నిర్బంధంగా విద్య నేర్పించడానికి ప్రభుత్వం బొక్క సం నుంచి విరివిగా ధనం వెచ్చించి విద్యాబోధ చేస్తున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వానికి లోబడి వున్న భారతదేశంలో ప్రజల నెత్తిన పన్నులు రున్దుటయేగాని విద్యావిషయంలో పుష్కలంగా ధనం వెచ్చించకపోపడంవల్లనూ నిర్బంధంగా విద్యాప్రచారం చేయటానికి ప్రభుత్వం పూను కోక పోవడంవల్లనూ, విద్యావిషయంలో భారత ప్ర్రజలు చాలా వెనక బడియున్నారు. విద్యావంతు లంటే అందరూ పండితులు పట్టభద్రులు కా నక్కరలేదు. రాష్ట్ర (మాతృ భాషలోనైనా ప్ర్రాధమిక విద్య వరకైనా మనిషి అనేవాడు చదివి వుండడం చాలా అవసరమని అంద రంగీకరిస్తారు. ప్రభుత్వంకూడా మాటల్లో అంగీకరిస్తుంది, కాని క్రియలో శూన్యం— విద్యాప్రచారం మాటలతో జరి గేది కాదు. ధనం వెచ్చించి తేనేగాని విద్యాప్రచారం సాగదు. మన దేశంలో ఇప్పుడు ఆంగ్లవిద్య చదువుకోవా లంటే ధనవంతులకే అవ కాశంగా బీదలకు అవకాశంలేదు. ఆ కారణంవల్ల ఆంగ్ల విద్య ఓదలు చదువుకునే సావకాశం పోయింది. ఇప్పు డాంగ్ల భాష చదవాలనే మోజు, ఆశలు, కూడా అణగి పోయినయి. ఇక దేశభాషలలో నైనా ఊరక చదువు చెప్పే పాఠశాలలు బహు తక్కువ. అసలు మన ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకు విద్యాభివృద్ధి కావడం యిష్టం లేకపోవడంవల్ల నే విద్యావిషయంలో ధనంవద్ద తొంటిచేయి చూపి స్తున్నారు. ఇప్పుడు భారత దేశంలో చదువుకొన్న నూటికి పదిమంది అయినా వి శేషంగా పట్టణాల్లో వున్నారు గాని పల్లెల్లో లేరు. కాబట్టి పల్లెటూళ్ల లో వి విద్యాశూన్యత మెండై నది. నిరక్షరకుక్షు నేటిపల్లెలు తాండవ మాడుతున్నాయి. లతో విద్యా విహీనతవల్లనే పల్లెలు నేడు ఆరోగ్యాది సమ స్త విషయాల్లో వెనకపడి పోతున్నాయి. కృశించి విద్యాశూన్యులైన ప్రజలకు స్వాతంత్య్రమనే విషయం బోధ కావడమే చాలా కష్టం. విద్య ఏమాత్రమైనా వచ్చివుంటేనేగాని కొంత ప్రపంచ జ్ఞానంకలిగి వర్తించడానికి సావకాశంలేదు. పా ధమిక విద్య వరకైనా బాలురకు నిర్బంధంగా ప్రభుత్వం చెప్పించటానికి పూనుకుంటే, తర్వాత కొంతవరకు స్వయంకృషి మీద విద్యాభివృద్ధి చేసుకోవడానికి ఈకాలంలో సావకాశం వుంది. కొంచెం భాషాజ్ఞానం కలవారికి నేడు వార్తా