Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.8 (1935).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రగద్య వాఙ్మయచరిత్రను వ్రాయుట కుత్సాహించు నవ్యులలో వీరొకరు. ఇట్టివారాంధ్ర వాఙ్మయమునకును (ఆంధ్ర) గ్రంథాలయోద్యమమునకును అత్యంత మైన సేవ చేసి శ్రేయస్సు నాపాదింపగలరు. యావదాంధ్ర వ్యాసలేఖన పోటీలో ప్రథమబహుమతినందిన వీరి ప్రథమవ్యాసము “గాంధీమహాత్ముని ప్ర్రాయోపవేశము - దానిఫలితములు”. ఈ పత్రికయఁదు ముద్రింపబడిన “గ్రంథాలయోద్యమము” పయి పోటీలో ప్రథమ బహుమతినిఒడసిన వీద్వితీయ వ్యాసము. వీరు ప్రస్తుతము ఆంధ్రా యూనివర్సిటీ వారిచే ఏర్పాటు చేయబడిన గ్రంథాలయ శిక్షణ తరగతులలో తరిఖీయదుపొందుచున్నారు.

శర్మగా రాంధవిశ్వకలా పరిషత్కలాశాల తెలుగు సంఘమునకు కార్యదర్శిగను అధ్యక్షులుగను ఉండి సంఘకార్యములను చక్కగా నిర్వర్తించి యుండిరి. బ్రిటిష్ డిబేటింగ్ టీమ్ (ఆంగ్లవ కృశ్వపజట్టు) ఆంధ్రాయూనివర్సిటీకి వచ్చినపుడు వీరు ఆంధ్ర విశ్వకలా పరిషత్కలాశాల విద్యార్థి బృందమున కధ్యక్షులుగు నుండిరి. వీరికివకృత్వాదు లందునేగాక వేషధారణాదు లందును ప్రవేశము అభిమానము గలవు. వేష ధారణమునకు ప్రతివత్సరము (ప్రయిజు) బహుమానములను యూనివర్సిటీ కాలేజీలో పొంది డిరి. వీరి వక్తృత్వ వ్యాసరచనా నైపుణ్యాదుల గూర్చి పండితులు, తెనుగు ఉపాధ్యాయ వర్గము, వైసుఛాన్సలరు రాధాకృష్ణన్, ప్రిన్సిపాలు కోయాజీ, ప్రొఫెసరు వెంకటరంగయ్య ప్రభృతులు ప్రశంసావాక్యముల వ్రాసి యుండిరి.

శర్మగారివంటి విద్యాధికులగు యువకులు గ్రామగంథాలయముల స్థాపించి వానియభివృద్ధికి శ్రీయోదాయకము. వారీకార్యమును వదలక తోడ్పడుట మన యుద్యమమునకు మిక్కిలి నిర్వహించిన ఆంధ్ర గ్రంథాలయోద్యమము చిరస్థాయియై ఇతోధిక సేవ చేయగలదనియు గనుక ఆంధ్రయువకులందరీ మహాకార్యమునకు ద్విగుణీకృణోత్సాహముతో పూనుదురనియు నానమ్మిక. ఆంధ్ర విశ్వకలా పరిషత్తువారు ఉపేంద్ర శర్మగారివలె గ్రంథాలయ శిక్షణము గఱచినటువఁటియు, ఆంధ్రము అభిమానవిషయముగ పఠించి నటు వంటియునటు వంటియు విద్యార్ధులనాదరించి, అబ్బూరి రామకృష్ణారావు F. L. A. గారి వంటి తెలుగు పండితులను ప్రోత్సాహపఱచియు ఆంధ్రగ్రంథముల కొకనూతన వర్గీకరణ పద్ధతిని(classifica- tion scheme) నిర్మాణము చేయించియు మార్గదర్శకు లగుదురుగాక.


గ్రంథాలయములు

యన్.జి.శాస్త్రి

ఆ. వె. ఆలయములలోన నవని గ్రంథాలయం
బురుఫలప దంబు; పరమతస్థు
లెంద రైన దీని పొందఁగా వీలగు,
నంటుదోస మిచట నరయరాదు.


తే.గీ. ఆకసమున నుండి కటికి చీకటిని న
శింపఁగాఁ జేయు పూర్ణశశివలె, నాల
యాల రాజిలు గ్రంథాలయాలు, పామ
రాళి యజ్ఞానమును బాఱఁద్రోలు కతన.