Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రము కూడ మన దేశమున అక్షరస్థుల సంఖ్య నూటికి 8 కంటెను అధికము కాలేదు. గ్రామ గ్రంథాలయ సమస్యను క్లిష్టపరచునదిదియే. అక్షరస్థులకై యేర్పాటు లొనరించుచు నిరక్షరకుక్షులను విడిచి పెట్టిన గ్రంథాలయోద్యమతశ్వము ఆలోచనరహిత మైనదని చెప్పక తప్పదు. అట్లు నిరవీరులను విడిచి పెట్టుటవలన ఈ విడిచి పెట్టుటవలన ఈ యుద్యమమునకు సిగ్గును జేకూర్చుటే గాక జాతీయాశయములకును హానికరముగ నుండును. ఇప్పటికే అక్షరస్థులకును నిరక్షరులకును గల వ్యత్యాసము మన దేశములోని అన్ని అంశముల అభివృద్ధికిని అంతరాయముగ నున్నది. మన దేశమున అక్షరస్థులు కొద్దిమంది మాత్రమేను. నిరక్షరులు తండోప తండములుగా నున్నారు. మన దేశమున కాయువుపట్టనందుగు విద్యావంతు లాంగ్లేయ విద్యాప్రచారకులగుట వలనను, దానినే సర్వవిధముల వాడుచు నిరక్షరుల సంగతి విచారించనందునను, ప్రాచీన విద్యాపద్ధతుల నభ్యసింపనందునను నిప్పటికే ఈ వ్యత్యాస మెక్కువగ నున్నది.

వాచక పద్ధతి

గ్రామగ్రంథాలయోద్యమమున కృషిజేయు భాషాసేవకులు తాత్కాలిక పద్దతిగ ఒక తరమువరకైన ఈ పద్ధతి సభ్యసించి భయంకరముగ నుండు నీ నిరక్షరసమస్యను నిర్మూలించుట యుక్తము. పాశ్చాత్యదేశములో గ్రామ గ్రంథాలయ ప్రియులు గ్రామస్థులకు పుస్తకములు నిండ్ల కిచ్చి వారిని జదువునట్టుగా జేయుట ముఖ్య కర్తవ్యమైయుండ మన దేశములో పల్లెటూరి యుపాధ్యాయుడీ నిరక్షరుల నందరిని — స్త్రీ, పురుషులను బీద వారిని, భాగ్యవంతులను, పిన్న పెద్దలను ఒక్కచో జేర్చి పల్లెటూరి పాఠశాలయందో, దేవాలయము నందో, గామోద్యోగుల నివాసస్థలములందో, వారికి ప్రియకరములైన పురాణములనో నవీన వ్యవసాయ ఆర్థిక విషయములనో చదువుటయే యుక్తము. జ్ఞాన చక్షువులు నేత్రములు గాని శ్రోత్రములు కావుగనుక ఉద్యమప్రియుడీ నిరక్షరులకై ప్రత్యేకముగ హృద్యమైన బొమ్మల పుస్తకముల నేర్పాటు చేయుట నుంచిది. వీనిని ప్రత్యేకముగ తయారు చేయవలసి యుండును; లేదా సచిత్ర దిన, వార, పక్ష, మాసపత్రికల నుండి సుబోధకమగునట్లు సక్రమముగ జోడించవలయును. పల్లెటూరి యుపాధ్యాయుడీ అక్షరశూన్యులకు పత్రికలను చదివి వినిపించుచు, ఈ యుద్యమవేత్తలు ప్రచురించు సచిత్ర పత్రికలను వారి యుపయోగమునకై వినియోగింపవలయును.

నిరక్షర నిర్మూలనము

రషియా మొదలగు దేశములలో సభ్యసించుచుండు ఇదే మోస్తరు పద్ధతి సాధ్యమైనంత త్వరలో వాచకుని సహాయ మపేక్షించకయే తమకు తామే చదువుకొనవలయుననెడి తీవ్ర ఆకాంక్ష పెద్దవారిలో, కలుగజేయునను నమ్మకమును సూచించుచున్నది. అట్టివారికి వాత-చదువు-లెక్క నేర్పుటకై తగు నేర్పాటుల జేయుట గ్రంథాలయోద్యను ప్రియులకు విధియై యున్నది. అట్టి పరిస్థితులలో వయసు మిరినవారనేకు లొక సంవత్సర కాలములో చిన్న చిన్న పుస్తకములను, రెండు సంవత్సరములలో కొంత పెద్దపుస్తకములను గూడ చదువ గలుగుదు రని రషియాలోని అనుభవమువలన తెలియుచున్నది.