Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.7 (1935).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముల గావించిరి. మిగత పది గ్రంథాలయములును ముందు సంవత్సరమున జరుగు ప్రచారమువలన బాగుపడగల వని యాశించుచున్నాను.

ఇట్లు పునరుద్ధరింపబడవలసిన గ్రామములలో ఓలేరు, పల్లెకోన, భట్టిప్రోలు, కావూరు ముఖ్యమైనవి. నాలుగును పెద్ద గ్రామములు. విద్యావంతు లనేకులు గలరు. కావూరులోని భారత సేవక మండలి' యను గ్రంథాలయమునకు, కొంత భూవసతియు నేత్రపర్వ మొనర్చు నొక రమణీయ భవనమును కలవు. గ్రంథాలయాభిమానము కూడ కొంత కలదుగాని అది యాచరణయందు లేకపోవుటయే లోపము, ఇకముందైనను కావూరు గ్రామవాసులు తమ గ్రంథాలయములు నుపయోగించుకొని యితర గ్రామముల వారికా దర్శప్రాయు లగుదురని విశ్వసించుచున్నాను. ఇట్లే ఓలేరు, పల్లెకూన, భట్టిప్రోలు, గ్రామములలోని దేశాభిమానులుసు, భాషాభిమానులును, తమ తమ గ్రంథాలయములను పునరుద్ధరింపజేసికొని శ్రీ భారతీ దేవికి ప్రేమపాత్రులగుదురని నమ్ముచున్నాను.

తాలూకాసంఘమువారు ఈ సంవత్సరకాలమున తాలూకా సంతను, రెండు, మూడు పర్యాయములు సంచారము గావించి గ్రంథాలయ ములవారిని ప్రోత్సహించి యుండిరి. మన తాలూకా యందు గ్రంథాలయ ప్రదర్శనమును 16 పర్యాయములు ప్రదర్శించిరి. తెనాలి, బాపట్ల తాలూకాల యందు కూడ 5 ప్రదర్శనముల గావించిరి.

అవకాశము కలిగినపుడెల్ల పంఘాధ్యక్షులైన శ్రీయుతులు కుటుంబరావు పంతులు గారు ఉపన్యాస రూపమున తమ యనుభవములను, గ్రంథస్థమైన కొన్ని ముఖ్య విషయములను తాలూకాలకు తెలియ జేయుచు, తాలూకా యందంతను ప్రచార మొనర్చిరి. 'నల్లూరు' లోని గ్రంథాలయము వీరి ప్రత్యేక కృషివలన పునరుద్ధరింపబడి యింతవరకు జయప్రదముగ శాస్త్రీయ పద్ధతులపైన నడుపబడు చున్నది. ఇంచుమించు తాలూకాయందన్ని గ్రంథాలయములు వీరికృషి ఫలితములు కొలదిగానో, గొప్పగనో, పొందిన వనియే చెప్పవచ్చును.

సంఘమువారు 4 దఫాలు సమావేశమై ముఖ్యవిషయములను చర్చించి తీర్మానించిరి. సంఘము వారు గ్రంథాలయములవద్ద నుండి మాసమున కొక పర్యాయము నివేదిక నొకదానిని తెప్పించుచున్నారు. దాని నింతవరకునే కొలది గ్రంథాలయముల వారో పంపు చున్నారు. కాని యందరును సరిగ పంపుట లేదు. గ్రంథాలయ పరిస్థితులు దెలిసికొనుట కది సహకారి కాగలదు గాన దాని యవసరమును గ్రంథాలయ పాలకులు గుర్తించి సరిగ, సకాలమునకు కార్యాలయమునకు పంపవలసి యున్నారు.